World Cup 2023 Opening Ceremony: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ సమరం భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్ వేట మొదలుకానుంది.  మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. ప్రతి టీమ్ మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ స్టేజ్‌లో 45 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ తొలి మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా.. ఓ బ్యాడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ కప్ 2023 ప్రారంభ వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బాలీవుడ్ తారలు, సంగీతకారులతో అబ్బురపరిచే, ఆకర్షణీయమైన ఈవెంట్‌గా ప్లాన్ బీసీసీఐ. అయితే బీసీసీఐ అనూహ్యంగా రద్దు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. రేపు (అక్టోబర్ 5న) ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా.. నేడు (అక్టోబర్ 4) మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లే వంటి ప్రముఖులతో జాబితా కూడా రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. 


ప్రారంభ వేడుకను ఉద్దేశించిన కెప్టెన్స్ డే ఈవెంట్ అనుకున్నట్లుగా కొనసాగుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పాల్గొనే జట్ల మొత్తం పది మంది కెప్టెన్లు ఈ ఈవెంట్‌కు హాజరవుతారు. ఆ తర్వాత ఆకట్టుకునే లేజర్ డిస్‌ప్లే ఉంటుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య భారీ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. లేదంటే అహ్మదాబాద్‌లో నవంబర్ 19 ఆదివారం జరిగే ఫైనల్ రోజున ముగింపు వేడుకను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్


Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook