World Cup 2023 Final Match Umpires: టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతూ అద్భుతమైన ఫామ్‌తో ప్రపంచకప్ 2023 ఫైనల్ వరకూ వచ్చింది. తుది సమరంలో ఇండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో తాజా అప్‌డేట్ కలవరపెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా అభిమానుల్ని కలవరపెడుతున్న ఆ అప్‌డేట్ ఫైనల్ మ్యాచ్ అంపైర్ విషయంలో. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు ఖరారయ్యారు. రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌ను అంపైర్లుగా ఐసీసీ ప్రకటించింది. ఈ ఇద్దరిలో రిచర్డ్ కెటిల్ బరో పేరు వినగానే టీమ్ ఇండియా క్రికెట్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో అంటే 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీపైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్  మ్యాచ్‌లకు రిచర్డ్ కెటిల్ బరోనే అంపైర్‌గా వ్యవహరించాడు. 


ఈ మ్యాచ్‌లలో రిచర్డ్ కెటిల్ బరో నిర్ణయాల వల్ల టీమ్ ఇండియా చాలావరకు నష్టపోయింది. అందుకే ఇప్పుడు అతను అంపైర్ అనగానే ఏదో తెలియని ిభయం వెంటాడుతోంది. అప్పటి ఫోటోలు షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. 


Also read: Cricket Sentiments: ప్రపంచకప్ ఫైనల్ చుట్టూ సెంటిమెంట్లు, మ్యాచ్ చూడవద్దంటూ అమితాబ్‌కు విజ్ఞప్తులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook