World Cup 2023 Semifinal Rules: ప్రపంచకప్ 2023 టోర్నీలో రెండు సెమీఫైనల్స్ మిగిలాయి. ఈనెల 15న న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య మొదటి సెమీపైనల్స్ అయితే, ఈ నెల 16న రెండవ సెమీఫైనల్స్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈనెల 19న తుదిపోరు అహ్మాదాబాద్ వేదికగా జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు వీస్తున్నాయి. ఫలితంగా సెమీస్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందేమోననే భయం వెంటాడుతోంది. అందుకే ఐసీసీ కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టింది. రిజర్వ్ డే ప్లేలో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడితే మరుసటి రోజు రిజర్వ్ డే నాడు మ్యాచ్ జరుగుతుంది. 


వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో ఆగిపోతే మ్యాచ్ ఎక్కడాగిందో అక్కడ్నించే తిరిగి ప్రారంభమౌతుంది. టీమ్ ఇండియా 25 ఓవర్లలో 200 పరుగులు చేసిన తరువాత మ్యాచ్ ఆగితే 26వ ఇన్నింగ్స్ నుంచి మ్యాచ్ కొనసాగుతుంది. అంతేకాకుండా సెమీపైనల్ మ్యాచ్‌కు అదనంగా 2 గంటల సమయం కేటాయించారు. అంటే మ్యాచ్‌కు రెండు గంటలు అంతరాయం వర్షం కారణంగా కలిగినా ఓవర్ల తగ్గింపు ఉండదు. 


అదనంగా కేటాయించిన 2 గంటల సమయం తరువాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగితే ప్రతి 5 నిమిషాలకు ఒక ఓవర్ తగ్గిస్తారు.సెమీఫైనల్ మ్యాచ్ కొనసాగించేందుకు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్ తరువాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగితే  డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఫలితం నిర్ణయించాలంటే రెండవ ఇన్నింగ్స్‌కు దిగిన జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ జరగకపోతే అంటే మ్యాచ్ ఏ విధంగానూ పూర్తికాకుంటే పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు. 


Also read: World Cup 2023 India Records: రికార్డులతో హోరెత్తిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook