World Cup 2023 India Records: రికార్డులతో హోరెత్తిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్
World Cup 2023 India Records: ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియాకు తిరుగులేకుండా పోయింది. ఒక్క మ్యాచ్ ఓడకుండా సెమీస్‌కు చేరింది. చివరి లీగ్ మ్యాచ్‌లో పెద్దఎత్తున రికార్డులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 India Records: టీమ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ఐసీసీ ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్. టీమ్ ఇండియా 160 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. వరుసగా 9 విజయాలతో సెమీస్ చేరి టీమ్ ఇండియా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో రికార్డులు హోరెత్తించాయి.
ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా చివరి లీగ్ మ్యాచ్ 160 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. దాంతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు పలు రికార్డులు సాధించారు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 62 బంతుల్లో సెంచరీ సాధించి వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. రాహుల్ ద్రావిడ్ తరువాత భారత్ తరపున ప్రపంచకప్‌లో రెండవ అత్యధిక స్కోరు సాధించిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 100వ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు 503 చేసిన టీమ్ ఇండియా కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు సౌరవ్ గంగూలీ 465 పరుగులు, విరాట్ కోహ్లి 443 పరుగులు చేశారు.
ఇక ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు 24 కొట్టిన ఆటగాడిగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఇతని తరువాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ 22 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. వరుసగా రెండవ ప్రపంచకప్‌లో 500 పైగా పరుగులు సాధించి ప్రపంచంలోనే తొలి బ్యాటర్ అయ్యాడు. 2019 ప్రపంచకప్‌లో 648 పరుగులు సాధించాడు.
ఈ ఏడాది టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 60 సిక్సర్లు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 58 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇయాన్ మోర్గాన్ స్థానాన్ని ఆక్రమించాడు. అదే సమయంలో ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన క్రికెటర్ కూడా రోహిత్ శర్మనే. ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మనే. ఒకే ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో టాప్ 4 బ్యాటర్లంతా 50కు పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లు హాఫ్ సెంచరీలు సాధించారు.
Also read: World Cup 2023: ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరేది ఎవరు, హషీం ఆమ్లా అంచనాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook