World Cup 2023: ప్రపంచకప్ 2023 టోర్నీ చివరికొచ్చేసింది. తుదిపోరుకు మరో రెండే రెండు మ్యాచ్‌లు మిగిలాయి. మొదటి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అయితే రెండవ సెమీ ఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇండియా నాటి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానలో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు సెమీస్‌లో బలమైన ప్రత్యర్ధే తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఐసీసీ నాకౌట్స్‌లో ఇండియాపై న్యూజిలాండ్ ఆధిక్యం ఉంది. అందుకే టీమ్ ఇండియా విషయంలో క్రికెట్ ప్రేమికులకు కాస్త ఆందోళనగానే ఉంది. 2019లో టీమ్ ఇండియా, కివీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీమ్ ఇండియా చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింట్లోనూ చెలరేగుతున్నారు. సొంత గడ్డ ముంబై కావడంతో ఇంకా కలిసొస్తుంది.
సెమీస్ బెర్త్‌లు ఖరారు కావడంతో ఇక ఫైనల్‌కు ఎవరు వెళ్తారు, టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయంలో చర్చ జరుగుతోంది. మెజార్టీ క్రీడా విశ్లేషకులు ఇండియాకే టైటిల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆడినట్టే ఆడితే టీమ్ ఇండియాకు ఫైనల్ అవకాశాలు కచ్చితంగా ఉంటాయని దక్షిణాఫ్రికా లెజెండ్ హషీం ఆమ్లా అంచనా వేశాడు. ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఎవరు గెలుస్తారు. ఫైసల్‌లో ఎవరు తలపడనున్నారనేది అంచనా వేశాడు.
మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా గెలిచి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఫైనల్‌కు చేరుతుందని అంచనా వేశాడు. అదే సమయంలో రెండవ సెమీ పైనల్‌లో ఆస్ట్రేలియపై విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందన్నాడు. అహ్మదాబాద్ వేదికపై ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరు టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుందని తెలిపాడు. ఇండియా ఏ విధమైన నెగెటివ్ ఆలోచనల్లేకుండా విజయమే లక్ష్యంగా బరిలో దిగితే న్యూజిలాండ్‌పై సులభంగా గెలుస్తుందని హషీంతోపాటు ఇతర క్రికెట్ నిపుణులు కూడా సూచించారు.
Also read: IND Vs NED Highlights: నెదర్లాండ్స్‌పై టీమిండియా భారీ విజయం.. అజేయంగా సెమీస్‌లోకి ఎంట్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook