World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
ICC World Cup 2023 Points Table Updates: ప్రపంచ కప్ పాయింట్స్ టేబుల్లో దక్షిణాఫ్రికా జట్టు టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చింది. ఆస్ట్రేలియాను 134 పరుగుల తేడాతో ఓడించి.. టోర్నీలో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. న్యూజిలాండ్, టీమిండియా, పాక్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ICC World Cup 2023 Points Table Updates: వరల్డ్ కప్ అంటేనే రెచ్చిపోయి ఆడే ఆస్ట్రేలియా ఈసారి తేలిపోతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రపంచకప్‌లో సఫారీలకు ఇది వరుసగా రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలను సఫారీ బౌలర్లు కంగారెత్తించారు. రబాడా మూడు వికెట్లతో చెలరేగాడు. కేశవ్ మహారాజ్, మార్కో జాన్సన్, శంసీ తలో రెండు వికెట్ల తీయడంతో 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు డికాక్‌కు దక్కింది.
ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అగ్రస్థానంలో ఉన్న కివీస్ రెండు, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. టాప్-4లో ఉన్న జట్లు రెండు విజయాలు సాధించగా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రికా టాప్ ప్లేస్‌లో ఉంది. మెగా టోర్నీలో ఒక్కొ విజయం సాధించిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక తరువాతి స్థానాల్లో శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు తొలి గెలుపు కోసం చెమటడొస్తున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత టాప్-4లో ఉన్న జట్లు సెమీస్‌లో అడుగుపెడతాయి.
శుక్రవారం బంగ్లాదేశ్‌తో కివీస్ తలపడుతుంది. బంగ్లాపై న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. దక్షిణాఫ్రికాను మొదటి స్థానం నుంచి పడగొట్టి టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. చెన్నెలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అందుబాటులోకి వస్తుండడంతో కివీస్ మరింత బలోపేతంగా మారనుంది. విలియమ్సన్ స్థానంలో టామ్ లాథన్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ చేతిలో గత మ్యాచ్‌లో ఓటమిపాలైన బంగ్లాదేశ్.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు షాకివ్వాలని చూస్తోంది. కెప్టెన్ షకీబుల్ హాసన్, మహేదీ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ త్రయం రెండు మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టి ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. ఇక టోర్నీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసలు పోరు రేపు జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అహ్మాదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి