World Cup 2023 Tickets Online Booking Date: భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. రీసెంట్‌గా కొన్ని మ్యాచ్‌ల్లో మార్పులు చేసింది. 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు జరగ్గా.. ఇందులో టీమిండియా 2 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇక ప్రపంచకప్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి చూడాలని ఎంతో మంది క్రికెట్ ప్రియులు రెడీ అవుతున్నారు. టికెట్ల బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా..? అని వెతుకున్నారు. తాజాగా భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లకు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో టీమిండియా వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డే వరల్డ్ కప్ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే అభిమానులు ముందుగా ఆగస్టు 15 నుంచి www.cricketworldcup.com/registerని సందర్శించి పేరు నమోదు చేసుకోవాలని ఐసీసీ సూచిస్తోంది. మ్యాచ్‌ల వారీగా ఆగస్టు 25వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. బుక్‌మై షోలో ప్రపంచ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ముందుగా పేరు నమోదు చేసుకుంటే.. టికెట్లు గురించి అప్‌డేట్స్‌ స్వీకరించవచ్చని తెలిపింది ఐసీసీ. అంతేకాకుండా టికెట్లు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రపంచ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌ల టికెట్లను దశలవారీగా విక్రయించనున్నట్లు తెలిపింది.


టికెట్ల బుకింగ్ ఇలా..


==> ఆగస్టు 25- భారత్ మ్యాచ్‌లు మినహా.. అన్ని వార్మప్ మ్యాచ్‌లకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
==> ఆగస్టు 30- గౌహతి, త్రివేండ్రంలో టీమిండియా మ్యాచ్‌ల కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
==> ఆగస్టు 31– చెన్నై, ఢిల్లీ, పూణేలో భారత జట్టు మ్యాచ్‌లకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
==> సెప్టెంబర్ 1– ధర్మశాల, లక్నో, ముంబై నగరాల్లో టీమిండియా మ్యాచ్‌ల కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
==> సెప్టెంబర్ 2– బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్
==> సెప్టెంబర్ 3– పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌ టికెట్ల బుకింగ్
==> సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ల బుకింగ్


చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడిన తరువాత టీమిండియా ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు సెప్టెంబర్ 3న టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుండగా.. క్షణాల్లో టికెట్లు అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా నాలుగో మ్యాచ్‌ని బంగ్లాదేశ్‌లోని పుణెలో ఆడనుంది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌, తరువాత లక్నో నగరంలో ఇంగ్లండ్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. చివరి 3 మ్యాచ్‌లను ముంబై, కోల్‌కతా, బెంగళూరు స్టేడియాల్లో పోటీ పడనుంది. 


Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  


Also Read: Interest Rate Hikes: ఒక్కరోజులోనే కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈఎంఐల మోత..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి