Virat Kohli May Creates New Record in IND vs BAN: టీ20 వరల్డ్ కప్‌లో మరికాసేపట్లో కీలక సమరం మొదలు కానుంది. అడిలైడ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని టీమిండియా చూస్తుండగా.. భారత్‌ వరల్డ్ కప్‌ వేటకు అడ్డుకట్ట వేయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం రెండు విజయాలు, ఒక ఓటమితో రెండు జట్లు సమానంగా నాలుగు పాయింట్లు సాధించాయి. అయితే భారత్‌కు నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో రెండోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో రన్‌ మెషిన్  విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. రెండు అర్ధ సెంచరీలతో అలరించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 15 పరుగులు చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ 1001 పరుగులు చేయగా.. మహేల జయవర్ధనే 1016 పరుగులతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 


ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. 112 టీ20 మ్యాచ్‌ల్లో 3868 పరుగులు చేశాడు. ఇందులో ఒక మెరుపు సెంచరీ కూడా ఉంది. అప్ఘానిస్తాన్‌పై సెంచరీ తరువాత కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లీ మరోసారి విజృంభిస్తే భారత్ గెలుపు నల్లేరుపై నడకే. సఫారీ మ్యాచ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-౩ ఆటగాళ్లు


1. మహేల జయవర్ధనే (శ్రీలంక) - 1016 పరుగులు
2. విరాట్ కోహ్లీ (భారత్) - 1001 పరుగులు
3. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 965 పరుగులు 


Also Read: India Vs Bangladesh Dream 11 Team: బంగ్లాతో భారత్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!  


Also Read: Munugode By-Elections: మునుగోడులో బీజేపీ ఓటమి బాధ్యత నాదే.. జేపీ నడ్డాకు బండి సంజయ్ లేఖ రాశారట.. ఇదేం పంచాయితీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి