India Vs Bangladesh Dream 11 Prediction: టీ20 వరల్డ్ కప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమిండియాతో బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి నుంచి తెరుకునేందుకు రెడీ అవుతోంది. అటు జింబాబ్వేపై విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరుకోవాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా అడ్డుకట్ట వేస్తామని బంగ్లా ధీమాతో ఉంది. రెండు జట్ల మధ్య పోరు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.
అడిలైడ్ వేదిక మ్యాచ్ జరగనుండగా.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకులించే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపవచ్చు. ఆరంభంలో పిచ్ పేసర్లకు సహరించే అవకాశం ఉండగా.. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వికెట్‌పై ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 180 పరుగులుగా ఉంది. అయితే ఈ పిచ్‌పై ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ సార్లు గెలుపొందాయి. ఈ మైదానంలో ఛేజింగ్ చేసినట్ల 60 శాతం విజయం సాధించాయి.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్/చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్.
డ్రీమ్ 11 టీమ్: విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), లిటన్ దాస్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, అఫీఫ్ హుస్సేన్, షకీబ్ అల్ హసన్, హర్ధిక్ పాండ్యా, తస్కిన్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook