IND Playing XI SA: పటీదార్, త్రిపాఠికి నిరాశే.. ఆ ఒక్కడికి ఛాన్స్! మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే
India vs South Africa Predicted Playing XI for 3rd ODI. ఢిల్లీ వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిద్దాం.
India vs South Africa Predicted Playing XI for 3rd ODI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓడిన భారత్.. రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి మూడు మ్యాచుల సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా నేడు జరిగే ఆఖరి వన్డేలో విజయమే లక్ష్యంగా గబ్బర్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్ సంగతి పక్కన పెడితే 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ గెలవడం దక్షిణాఫ్రికాకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచులో భారత్ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.
భారత్ లక్ష్యం ప్రస్తుతం సిరీస్ గెలవడమే కాబట్టి.. మూడో వన్డే మ్యాచ్‌కు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు. దాంతో యువ ఆటగాళ్లకు నిరాశే ఎదురుకానుంది. రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ కుమార్‌లకు జట్టులో చోటు దక్కకపోవచ్చు. ముఖ్యంగా జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనలకు ఎంపికైన త్రిపాఠి.. దక్షిణాఫ్రికాపై కూడా ఆడకపోవచ్చు. త్రిపాఠి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా భారత్ తరఫున ఆడలేదు.
టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న రవి బిష్ణోయ్‌కు చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్లలో ఒకరిపై వేటు పడనుంది. ఇక ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ సత్తాచాటాల్సి ఉంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్ జట్టుకు కలిసిరానుంది. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ ఆడటం ఖాయం.
తుది జట్టు (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ (కీపర్), షెహ్‌బాజ్ అహ్మద్/రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్.
Also Read: 9 Slips Fielders: స్లిప్‌లో 9 మంది ఫీల్డర్లు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాన జోరు.. మరో నాలుగు రోజులుపాటు ఇలాగే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook