9 fielders in slip cordon at European Cricket League 2022: సాధారణంగా క్రికెట్‌లో స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ఫీల్డర్లు ఉంటారు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ అయితే చివరకు నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఇక టెస్ట్ క్రికెట్ అయితే ఐదుగురు ఫీల్డర్లు ఉంటారు. అయితే ఏకంగా తొమ్మిది మంది స్లిప్ ఫీల్డర్లు ఉండడం ఎప్పుడైనా చూసారా?. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్లిప్‌లో ఏకంగా 9 మంది ఫీల్డర్లు ఫీల్డింగ్ చేశారు. కీపర్, బౌలర్ తప్పితే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది. రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే జట్టు స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. ఏకంగా తొమ్మిది మంది ఫీల్డర్లను చూసి.. బ్యాటర్ అస్సలు భయపడలేదు. బ్యాటర్ చాలా తెలివిగా ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు. చివరి ఫీల్డర్ దగ్గరలోంచి వెళ్లిన బంతి బౌండరీ వద్దకు వెళ్ళింది. ఫీల్డర్ బంతిని ఛేజ్ చేసేలోగా.. బ్యాటర్ రెండు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ మ్యాచులో నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులకే పరిమితం అయింది. మ్యాచ్ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను పెట్టినట్టు నార్వే కెప్టెన్ చెప్పాడు. ఆ ఘటన చాలా సరదాగా అనిపించిందని కూడా పేర్కొన్నాడు.
Also Read: ICC awards: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా హర్మన్, రిజ్వాన్
Also Read: Nobel Prize Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు ఆర్థిక నోబెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook