IND Playing XI vs NZ 2nd ODI 2023: న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో గెలిచిన భారత్.. మరో కీలక సమరానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం (జనవరి 21) రాయ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో కివీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. రెండో వన్డేలోనూ విజయం సాధించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ నేపథ్యంలో రెండో వన్డేలో టీమిండియా కాంబినేషన్‌ను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. గిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మంచి ఫామ్ మీదున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గత మ్యాచులో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో కోహ్లీ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇక మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన ఇషాన్కిషన్, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. టాప్-5లో మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో.. రజత్ పటీదార్, శ్రీకర్ భరత్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.


ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ రెండో వన్డేలోనూ బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఖాయం కాగా.. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో ఉమ్రాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. శార్దూల్ రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. మరోవైపు వైడ్లు కూడా బాగానే వేశాడు. 
 
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్. 


Also Read: Swiggy Lays Off: భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!


Also Read: Shubman Gill: అలాంటి ఆటగాళ్లను కనుగొనడం చాలా కష్టం.. రోజర్ ఫెదరర్‌తో శుభమాన్ గిల్‌ను పోల్చిన సల్మాన్!  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.