ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సొంతగడ్డపై చెలరేగిపోతున్నాడు. తన కెరీర్‌లో ఎన్నడూ లేనంతగా ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో మెరుపు శతకం బాదిన స్టీవ్ స్మిత్ వరుసగా రెండో వన్డేలోనూ భారత జట్టుపై మరో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. కీలకమైన రెండో వన్డేలోనూ ఆసీస్ ఆటగాళ్లు చెలరేగడంతో విరాట్ కోహ్లీ సేనకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : India vs Australia 1st ODI Highlights: శతక్కొట్టిన స్మిత్, ఫించ్.. తొలి వన్డేలో భారత్ పరాజయం



స్టీవ్‌ స్మిత్‌ (104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకానికి తోడు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (83; 77 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6x4, 1x6) కీలక అర్ధశతకాలు సాధించారు. చివర్లో లబుషేన్‌ (70; 61 బంతుల్లో 5x4), మాక్స్‌వెల్‌ (63; 29 బంతుల్లో 4x4, 1x6) టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో రెండో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య ఆసీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా తలో వికెట్‌ తీసినా ప్రభావం చూపించలేకపోయారు.




తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో తప్పక నెగ్గాల్సి ఉంది. కానీ భారత జట్టుపై వన్డేలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండు వన్డేలలో తమ అత్యధిక స్కోరు నమోదు చేయడం గమనార్హం. భారత్‌పై తొలి వన్డేలో 374 పరుగులు అత్యధిక స్కోరు కాగా, రెండో వన్డేలో ఆ రికార్డును అధిగమించింది. నేడు సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 389 పరుగులు చేసి తొలి వన్డే రికార్డును ఆసీస్ బద్ధలుకొట్టింది. విరాట్ కోహ్లీ సేనకు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook