Suryakumar Yadav: ఇదేం బాదుడు సూర్య భాయ్.. వరుసగా నాలుగు సిక్సర్లతో ఆ బౌలర్‌కు చుక్కలు
Ind Vs Aus 2nd Odi Highlights: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడంతో వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో ఆసీస్‌పై వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు సూర్యకుమార్ యాదవ్.
Ind Vs Aus 2nd Odi Highlights: ప్రపంచకప్‌లో టీమిండియా ఐసీసీ వన్డే నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. ఆసీస్‌ను వరుసగా రెండు వన్డేల్లో ఓడించిన భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో విరుచుకుపడింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్‌లో ఉండడంతో భారత్‌కు కలిసి వచ్చే అంశం. రెండో వన్డేలో గిల్, అయ్యర్ శతకాలతో చెలరేగగా.. రాహుల్, సూర్య అర్ధసెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించి.. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. కేవలం 37 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో నాలుగు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్‌లో 44వ ఓవర్‌లో గ్రీన్ బౌలింగ్‌కు రాగా.. మొదటి బంతికి సూర్య సిక్సర్‌తో స్వాగతం పలికాడు. తర్వాతి బంతికి అదే ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. చక్కటి స్కూప్‌ను సిక్సర్ బాదాడు. 3వ బంతికి డీప్ ఎక్స్‌ట్రా కవర్‌పై సిక్స్ కొట్టాడు. అదే ఊపులో నాలుగో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ ఓవర్‌లో చివరి రెండు బంతుల్లో 2 పరుగులు రావడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి.
వన్డేల్లో వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రెండు ఇన్నింగ్స్‌లతో మొత్తం అనుమానాలను పటాపంచలు చేశాడు. చివర్లో హిట్టింగ్‌కు సూర్య పర్ఫఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఉన్నాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్‌లోకి రావడంతో తుది జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. మొదటి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ ఆడనుండగా.. 4వ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, పాండ్యా హిట్టింగ్ బాధ్యతలు చూసుకుంటారు. ప్రపంచకప్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది త్వరలోనే తేలిపోనుంది.
Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి