IND vs AUS 2nd T20I, Dinesh Karthik says No One play Fast Bowling like Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఫాస్ట్ బౌలింగ్ ఆడగల అతని సామర్థ్యం మరెవరికీ లేదన్నాడు. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా ఆడాడని డీకే కితాబిచ్చాడు. శుక్రవారం నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (46 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 4×6) దంచుడు ఆరంభిస్తే.. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (10 నాటౌట్‌; 2 బంతుల్లో 1×4, 1×6) తనదైన ఫినిషింగ్‌తో ముగించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. మొదటి రెండు బంతులను సిక్సర్‌, ఫోర్‌ బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 'టీమిండియాకు విజయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలని చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తోన్నా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఇంటర్నేషనల్స్‌లోనూ ఫినిషింగ్ ఇవ్వడం చాలా బాగుంది. విక్రమ్ రాథోర్ మరియు రాహుల్ ద్రవిడ్ మెళకువలు చెపుతున్నారు. నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయను కానీ వీలైనంత నిర్దిష్టంగా ఆడుతా' అని అన్నాడు. 


'ఈ మ్యాచులో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. నేసు రెండు బంతులు ఆడాను. జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేసాను. కొత్త బంతి.. అందులోనూ టాప్-క్లాస్ బౌలర్లపై ఇటువంటి షాట్లు ఆడటం అంత సులభం కాదు. రోహిత్ ఎందుకు పెద్ద స్టార్ అయ్యాడో ఇంతకంటే రుజువు ఏముంటుంది. భారత క్రికెట్‌లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్‌లో కూడా ఫాస్ట్ బౌలింగ్‌ని ఆడగల అతడి సామర్థ్యం మరెవరికీ లేదు. అందుకే రోహిత్ చాలా స్పెషల్' అని దినేష్ కార్తీక్ అన్నాడు.



'క్రీజులోకి రాగానే రోహిత్ శర్మ ఎక్కువగా ఏం చెప్పలేదు. బౌలర్ ఏమి చేస్తాడో నాకు చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే నా ప్రణాళికలు నాకు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఎలా ఆడాలో ఆలోచించా. రెండు షాట్లు ఆడడం మంచి అనుభూతిని ఇచ్చింది. బాల్‌తో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం బాగుంది. సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఎటువంటి గాయాలు లేకుండా ప్రేక్షకుల కోసం ఒక ప్రదర్శనను ఇచ్చిందనదుకు మేము సంతోషిస్తున్నాము' అని డీకే చెప్పుకొచ్చాడు.  


Also Read: రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్‌షిప్‌ను సాధించిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్!


Also Read: Gold Price Today 24 September: పండగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.