IND vs AUS 2nd T20I Highlights: ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే  2-0 తేడాతో విరాట్ కోహ్లీ సేన పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సాధించింది. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను గెలిచింది. వన్డేల్లో తేలిపోయిన టీమిండియా టీ20ల్లో మాత్రం దూకుడు ప్రదర్శించి, సత్తా చాటింది. విదేశాలలో 2019 నుంచి భారత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. వరుసగా 10వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా నెగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూవెడ్ (58: 32 బంతుల్లో 10x4, 1x6), స్టీవ్‌స్మిత్ (46: 38 బంతుల్లో 3x4, 2x6) రాణించారు. అయితే తొలి టీ20లో రాణించిన టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్ (1/51) సహా దీపక్ చాహర్ ధారాళంగా పరుగులిచ్చి నిరాశ పరిచారు. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ 2/20తో ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. దీంతో ఆసీస్ 200 పరుగులలోపే ఇన్నింగ్స్ ముగించింది.


Also Read : India Vs Australia ODI Series: క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన


 



 


195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభానిచ్చారు. కేఎల్ రాహుల్ (30: 22 బంతుల్లో 2x4, 1x6) ఔటైనా శిఖర్ ధావన్ తగ్గలేదు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (52: 36 బంతుల్లో 4x4, 2x6), విరాట్ కోహ్లీ (40: 24 బంతుల్లో 2x4, 2x6) రాణించారు. వేగంగా ఆడే క్రమంలో సంజు శాంసన్ (15: 10 బంతుల్లో 1x4, 1x6) ఔటయ్యాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, హార్దిక్ పాండ్యా ఓ డబుల్ తీయడంతో పాటు రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ భారత్ వశమైంది. నామమాత్రమైన చివరి టీ20 సిడ్నీలో వేదికగానే మంగళవారం జరగనుంది. 


Also Read : Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook