Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు!

India vs Australia 1st T20 Highlights | వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. కీలక బౌలర్ చాహల్ బౌలింగ్‌లో రాణించకపోవడం సైతం వన్డే సిరీస్‌లో భారత ఓటమికి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ అంతలోనే ఎంతమార్పు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తొలి టీ20లో ఆసీస్ జట్టుపై భారత్‌కు విజయాన్ని అందించాడు.

Last Updated : Dec 4, 2020, 08:53 PM IST
Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు!

India vs Australia 1st T20 Highlights | ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. కీలక బౌలర్ చాహల్ బౌలింగ్‌లో రాణించకపోవడం సైతం వన్డే సిరీస్‌లో భారత ఓటమికి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ అంతలోనే ఎంతమార్పు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో యుజువేంద్ర చాహల్‌(Yuzvendra Chahal)కు చోటు దక్కలేదు. అయితేనేం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదెలా సాధ్యమంటారా.. ఆ వివరాలు మీకోసం...

ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హెల్మెట్‌కు బంతి తగిలింది. అయితే తాను చేసే పరుగులు జట్టుకు అవసరమని నొప్పిని భరిస్తూ బ్యాటింగ్ చేశాడు. అయితే జడేజా స్థానంలో యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడతాడని రిఫరీకి కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. రిఫరీ ఓకే చెప్పడంతో బౌలింగ్‌లో బరిలోకి దిగిన చాహల్.. ఎక్కడ పరాభవం ఎదురైందో అదే జట్టుపై తొలి టీ20లో ప్రతీకారం తీర్చుకున్నాడు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

4 ఓవర్లలో 25 పరుగులిచ్చిన చాహల్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్‌ల వికెట్లు పడగొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో తొలి టీ20లో ఆసీస్‌పై 11 తేడాతో భారత్ విజయం సాధించింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆటాడేసుకున్నాడని చెప్పవచ్చు. దీంతో వన్డే సిరీస్‌లో తనకు ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకున్నాడు. పనిలో పనిగా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Photo Gallery: Samantha Photos: టాలీవుడ్ నటి సమంత ఫొటోస్ ట్రెండింగ్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x