IND vs AUS 2nd Test 2023 Day 1 Highlights: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ఆరంభం అయిన రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 21 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ మహమ్మద్‌ షమీ (4/60) చెలరేగగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (3/57), రవీంద్ర జడేజా (3/68) తిప్పేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 242 రన్స్ వెనకపడి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టెస్టులో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా (81; 125 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్ వార్నర్ (15) మొదటి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన వార్నర్‌ను మొహ్మద్ షమీ బోల్తా కొట్టించాడు. కీపర్‌ శ్రీకర్ భరత్‌ క్యాచ్ పట్టడంతో వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. అయితే మార్నస్‌ లబుషేన్ (18)తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో కీలకమైన లబుషేన్, స్టీవ్ స్మిత్ (0) వికెట్లను ఆర్ అశ్విన్‌ పడగొట్టాడు. 



ఎన్నో ఆశలు పెట్టుకొన్న ట్రావిస్‌ హెడ్‌ (12) కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కీలక సమయంలో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (67 నాటౌట్ )తో కలిసి ఉస్మాన్‌ ఖవాజా మరోసారి కీలక (59) భాగస్వామ్యం నిర్మించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌ సూపర్ క్యాచ్‌ పట్టడంతో.. ఖవాజా కథ ముగిసింది. ఇక ఆసీస్ ఇనింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదనుకున్న సమయంలో హ్యాండ్స్‌కాంబ్ బాగా ఆడాడు . కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ (33) అండతో జట్టు స్కోరును ముందుకు నడిపాడు. కమిన్స్‌ సహా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లను జడేజా, మొహ్మద్ షమీ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఆలౌట్ అయింది.


Also Read: Diney+ Hotstar Down: డిస్నీ+ హాట్‌స్టార్‌లో అంతరాయం.. మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌! క్రికెటర్ కూడా ట్వీట్  


Also Read: Belly Fat: ఈ 2 వర్కవుట్స్‌తో బెల్లీ ఫ్యాట్‌ వెన్నలా 8 రోజుల్లో కరగడం ఖాయం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.