BCCI paln to shifting India vs Australia 3rd T20 from Hyderabad over Tickets Issue: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 25) భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ జరగడం దాదాపుగా అసాధ్యమే అని సమాచారం తెలుస్తోంది. మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల అమ్మకం విషయంలో హెచ్‌సీఏ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం అట. టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏపై గుర్రుగా ఉన్న బీసీసీఐ.. మూడో టీ20 మ్యాచ్‌ను మరో చోటుకు మార్చే ఆలోచనలో ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్లను సెప్టెంబర్ 15న రాత్రి 8 గంటలకు ‘పేటీఎం’లో అమ్మకానికి పెట్టారు. ఆ టికెట్స్ కొన్ని క్షణాల్లోనే అయిపోయాయి. ఆరోజు సుమారు 10-15 వేల టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని తెలుస్తోంది. టికెట్లపై హెచ్‌సీఏ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. యాప్‌లో అన్ని టికెట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫాన్స్ మండిపడ్డారు. మ్యాచ్ రోజు దగ్గరపడుతుండంతో.. బుధవారం అభిమానులు జింఖానా మైదానానికి వెళ్లారు. గేట్లు మూసి ఉండటంతో గేట్లు దూకి లోపలికి ప్రవేశించి.. హెచ్‌సీఏ డౌన్‌ డౌన్‌, ఇప్పుడే టిక్కెట్లు అమ్మాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దాంతో గురువారం టికెట్లు అమ్మనున్నట్లు హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. 


గురువారం ఉదయమే పెద్ద ఎత్తున క్రికెట్ ఫాన్స్ జింఖానా గ్రౌండ్‌కు చేరుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఇక నిన్న కుడా ఎన్ని టికెట్స్ అమ్మారనే దానిపై స్పష్టత లేదు. 39 వేల టికెట్స్ ఏమయ్యాయో ఎవరికీ తెలియరాలేదు. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ ఒక్కరే 10 నుంచి 12 వేల టికెట్స్ తీసుకున్నారని నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. అలానే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భారీగా టికెట్స్ తీసుకున్నారట. 


హెచ్‌సీఏ తీరుపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫైర్ అయింది. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇక టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయయాని, ఆన్‌లైన్‌లో పెట్టడానికి కూడా లేవని అజారుద్దీన్‌ తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం బీసీసీఐ వద్దకు చేరిందట. దీనిపై ఈరోజు సమీక్ష నిర్వహించి.. బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దాదాపుగా మ్యాచ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏదేమైనా ఈరోజు ఓ స్పష్టత రానుంది. 


ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39 వేలు. సాధారణంగా క్లబ్‌లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బంది, ఇతరులకు కలిపి మొత్తం 9 వేల దాకా పాసులు వెళ్తాయి. మిగతా 30 వేల టికెట్లను అభిమానుల కోసం కేటాయించాలి. అయితే హెచ్‌సీఏ పెద్దలు ఎన్ని పాస్‌లు ఇచ్చారో, ఎన్ని టికెట్లు అమ్మారో లెక్క చెప్పట్లేదు. ఇదే మొదటికే మోసం వచ్చేలా ఉంది. మరి మ్యాచ్ జరగకుంటే.. టికెట్స్ తీసుకున్న అభిమానుల పరిస్థితి ఏంటో మరి. 


Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ టీ20 ఫ్రీగా చూడడం ఎలానో తెలుసా?


Also Read: బుమ్రా, చహర్ ఇన్.. ఉమేశ్, హర్షల్ ఔట్! ఆస్ట్రేలియాతో తలపడే భారత్ తుది జట్టు ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.