IND vs AUS 3rd T20I Tickets, Hyderabad Cricket Fans Fires on HCA President Mohammad Azharuddin: హైదరాబాద్‌ నగరంలోని జింఖానా మైదానం వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు కొట్టుకుంటున్నారు. ఓవైపు వర్షం పడుతున్నా.. ఫాన్స్ అందరూ టికెట్స్ కోసం ఎగబడ్డారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. లోపలికి వెళ్లేందుకు అభిమానులు గేట్లు పగులగొట్టారు. ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో.. తొక్కిసలాట జరిగింది. పోలీసులు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టికెట్స్ కోసం అంచనాలకు మించి అభిమానులు రావడంతో పరిస్థితిని నియంత్రించడం పోలీసులతో సాధ్యం కాలేదు. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఫాన్స్ తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ఫాన్స్ స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో మహిళా ఫాన్స్ కూడా ఉన్నారు. ఓ అమ్మాయి పరిస్థితి విషయంగా ఉంది. అభిమానులతో పాటు 10 మందికిపైగా పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈరోజు కేవలం 5 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం. వేల టికెట్స్ ఏమయ్యాయని ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాట జరగడంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మొహ్మద్ అజారుద్దీన్ ను క్రికెట్ ఫాన్స్ అమ్మనా బూతులు తిడుతున్నారు. బొంగులో టికెట్స్.. కొంచెం అయితే సచ్చేటోడిని అని ఓ అభిమాని తిట్టాడు. '** నా కొడుకు అజారుద్దీన్ వల్లే ఇదంతా', 
'హెచ్‌సీఏ వైఫల్యమే దీనికి కారణం. ఆన్ లైన్ లో టికెట్స్ పెడితే ఇదంతా ఉండేది కాదుగా అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 




Also Read: IND vs AUS 3rd T20 Tickets: అభిమానులకు 10 వేల టికెట్లేనా.. మిగతా 29 వేల టికెట్స్ ఏమయినట్టు! 


Also Read: IND vs AUS: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో పోలీసుల లాఠీఛార్జ్‌..పలువురికి గాయాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.