Virat Kohli Gifts His Jerseys To Australia Players Usman Khawaja And Alex Carey: టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం తన ఆటతోనే కాదు.. తన వ్యక్తిత్వంతో కూడా అభిమానుల మనుసును గెలుచుకుంటాడు. మైదానంలో తన చర్యలతో ఇప్పటికే ఎన్నోసార్లు అభిమానులచే శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా మరోసారి కింగ్ కోహ్లీ ఫాన్స్ మనసు గెలుచుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లకు తన జెర్సీని ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లోని చివరిదైన నాలుగో టెస్టులో విరాట్‌ కోహ్లీ తన సెంచరీ (186) దాహాన్ని తీర్చుకున్నాడు. 3 సంవత్సరాల  సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ నమోదు చేసి తన సత్తాను మరోసారి చాటాడు. కోహ్లీ అద్భుత ఆటతో కీలక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగో టెస్టు డ్రాగా ముగియగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖవాజా, వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కెరీల వద్దకు కోహ్లీ వెళ్లాడు. వారిని పలకరించి తన జెర్సీలను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరాట్‌ ప్రవర్తనను క్రికెట్‌ అభిమానులు ప్రశంసిస్తూన్నారు.



అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కీలక సమయంలో భారీ సెంచరీ చేశాడు. దాంతో మూడేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీకి ఇది 28వ సెంచరీ. కోహ్లీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు చేశాడు. తాజా సెంచరీతో కోహ్లీకి  'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. దాంతో భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో  దిగజా స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేతో సమంగా నిలిచాడు. కోహ్లీ, కుంబ్లే ఖాతాలలో ప్రస్తుతం 10  'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డులు ఉన్నాయి. 


Also Read: Albino Cobra Viral Video: అరుదైన అల్బినో కోబ్రాను ఎప్పుడైనా చూశారా?.. మీ దగ్గర ఉంటే మిలియన్ డాలర్లు సొంతం!  


Also Read: King Cobra Viral Video: బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఇంత ఈజీగా పట్టొచ్చా.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ అవుతాయి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.