Ind Vs Aus: సేఫ్ జోన్లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!
Ind Vs Aus 4th Test Day 2 Highlights: నాలుగు టెస్టులో ఆసీస్ జట్టు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. 480 పరుగులు చేయగా.. భారత్ కూడా దీటుగా జవాబిస్తోంది. మూడో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
Ind Vs Aus 4th Test Day 2 Highlights: బోర్డర్-గవాస్కర్ సిరీస్ సమం చేయాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో కదం తొక్కడంతో భారీ స్కోరు చేసింది. ఖవాజా 180 పరుగులు చేయగా.. కామెరాన్ గ్రీన్ 114 రన్స్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. భారత్ తరపున రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు.
రెండో రోజు తొలి సెషన్ ఆట ప్రారంభం కాగానే.. టీమిండియా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే ఉస్మాన్ ఖవాజా, గ్రీన్ జోడీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి సెషన్ మొత్తం వికెట్ ఇవ్వకుండా ఆడారు. లంచ్ తరువాత రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే కామెరూన్ గ్రీన్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రీన్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించి ఈ జోడిని విడదీశాడు. అలెక్స్ కారీ కూడా ఖాతా తెరవకుండానే అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
387 పరుగుల స్కోరు వద్ద కంగారూ జట్టుకు మిచెల్ స్టార్క్ రూపంలో మరో దెబ్బ తగిలింది. టీ సమయానికి ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో ఖవాజా పాతుకుపోయాడు. డబులు సెంచరీగా దిశగా దూసుకువెళ్తున్న ఖవాజాను 180 రన్స్ వద్ద అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. చివర్లో నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ భారత బౌలర్లను విసిగించారు. వీరిద్దరు 9వ వికెట్‌కు 70 పరుగులు జోడించారు. చివరకు 480 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ 2, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (18) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ డ్రైవింగ్ సీట్లో కూర్చొంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మూడో రోజు ఆట కీలకం కానుంది. వేగంగా బ్యాటింగ్ చేస్తూ.. ఆసీస్ కంటే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది.
Also Read: Vivek Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట
Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి