India vs Australia 4th Test Match drawn: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో.. ఇరు జట్ల కెప్టెన్ల నిర్ణయం మేరకు మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే అంపైర్లు డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023ని భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్‌లోని మొదటి మూడు టెస్టులు మూడు రోజుల్లోనే ముగియగా.. నాలుగో టెస్ట్ మాత్రం ఐదు రోజులు అయినా ఫలితం రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగో టెస్టు మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (90), మార్నస్ లబుషేన్‌ (63) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 రన్స్ చేయగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు దక్కగా.. ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డు సొంతం చేసుకున్నారు.


నాలుగో టెస్టు ముగియకముందే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023కు చేరిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్‌ గెలవడంతో భారత్‌కు బెర్తు ఖరారైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. భారత్ 58.80 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌లో జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌ జరుగనుంది.



ఇన్నింగ్స్‌ వివరాలు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 480 ఆలౌట్ 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 571 ఆలౌట్ 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 175-2 డిక్లేర్డ్‌


Also Read: WTC Final 2023 India: నాలుగో టెస్ట్‌తో సంబంధం లేకుండా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిన భారత్! కేన్‌ మామకు థాంక్స్  


Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.