India Qualify World Test Championship Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌తో సంబంధం లేకుండా రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడంతో భారత్ నేరుగా ఫైనల్ చేరుకుంది. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీ (121) సాధించి లంక ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో సోషల్ మీడియాలో కేన్ మామను లంక ఫాన్స్ తిట్టుకుంటుండగా.. భారత్ అభిమానులు మాత్రం కివీస్ మాజీ సారథికి థాంక్స్ చెపుతున్నారు.
శ్రీలంకతో తొలి టెస్టులో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేన్ విలియమ్సన్ (121 నాటౌట్; 194 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా.. డారిల్ మిచెల్ (81; 86 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు ) హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, జయసూరియ 2 వికెట్స్ పడగొట్టారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 302 పరుగులకు ఆలౌటై కాగా.. కివీస్ అద్భుత విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. నాలుగో టెస్ట్‌లో భారత్ ఓడితే ఫైనల్ ఆశలు గల్లంతయ్యేవి. ఇక న్యూజిలాండ్-శ్రీలంక టెస్ట్ సిరీస్ ఫలితంపై భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఆధారపడి ఉంది. న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ మ్యాచ్‌తో పాటు రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది. అయితే తొలి టెస్ట్‌లోనే లంక ఓడిపోవడంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. 2023 జూన్ 7-11 మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. తొలిసారి జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ ఓడిపోయింది. డబ్ల్యూటీసీ 2023 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (68.52 శాతం) అగ్రస్థానంలో ఉంది. భారత్ (60.29 శాతం) రెండో స్థానంలో కొనసాగుతోంది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా స్థానాల్లో మార్పు ఉండదు.
Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.