Hero Splendor+ @ Rs 18,000: రూ.18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! ఇవిగో పూర్తి వివరాలు

Hero Splendor+ @ Rs 18,000: హీరో స్ల్పెండర్‌ ప్లస్ బైక్ కొనాలని చూస్తున్నట్లయితే.. 18 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 14, 2023, 06:55 PM IST
  • కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్‌
  • వెంటనే కోనేయండి
  • పూర్తి వివరాలు ఇవే
Hero Splendor+ @ Rs 18,000: రూ.18 వేలకే హీరో స్ల్పెండర్‌ ప్లస్.. వెంటనే కోనేయండి! ఇవిగో పూర్తి వివరాలు

Hero Splendor+ @ Rs 18,000: ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ 'హీరో మోటోకార్ప్‌'కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 'హీరో స్ల్పెండర్‌' అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా (కమ్యూటర్ బైక్‌లలో) నిత్యం దూసుకుపోతుంది. హీరో స్ల్పెండర్‌ను కంపెనీ నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూ ఉండడమే హీరో స్ల్పెండర్‌ సక్సెస్‌కు కారణం. మరోవైపు హీరో స్ల్పెండర్‌ ప్లస్ (Hero Splendor Plus) దాని మైలేజ్ మరియు విశ్వసనీయతకు భారత మార్కెట్‌లో ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఈ బైక్ కొనాలని చూస్తున్నట్లయితే.. 18 వేలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

హీరో స్ల్పెండర్‌ ప్లస్ 97.2cc ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8000 rpm వద్ద 8.02 PS గరిష్ట శక్తిని మరియు 6000 rpm వద్ద 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ల్పెండర్‌ ప్లస్ బైక్ మొత్తం 4 వేరియంట్లలో వస్తుంది. ఈ బైక్ బేస్ వేరియంట్ (డ్రమ్ సెల్ఫ్ స్టార్ట్) ధర 72 వేల రూపాయల (Hero Splendor Plus 2023 Price) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ (i3s డ్రమ్ సెల్ఫ్ స్టార్ట్ మాట్ గోల్డ్) ధర రూ. 74,400లుగా ఉంది. ఈ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కాగా.. ఆన్-రోడ్ ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది.

హీరో స్ల్పెండర్‌ ప్లస్ బైక్‌ను లోన్‌పై చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఆన్-రోడ్ ధర రూ. 86,864లుగా ఉంది. ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు. వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది, లోన్ కాలపరిమితి 1-7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు రూ. 18,000 (20%) డౌన్ పేమెంట్ కట్టి.. వడ్డీ రేటు 10 శాతంగా, 3 సంవత్సరాల రుణ కాలవ్యవధిని (Hero Splendor Plus EMI Calculator) ఎంచుకుందాం. ఇలా ఎంచుకుంటే.. మీరు ప్రతి నెలా రూ. 2,222 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం లోన్ ను(రూ. 68,864) అదనంగా రూ. 11,128 చెల్లించాల్సి ఉంటుంది. హీరో స్ల్పెండర్‌ ప్లస్ బైక్‌ను ఇష్టపడి, డబ్బులు ఎక్కువగా లేని వారికి ఈ లోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

Also Read: Cheapest Tata SUV 2023: డెడ్ చీప్‌ ఎస్‌యూవీ ఇదే.. 1.5 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి! షోరూమ్‌లో భారీ లైన్‌

Also Read: Best Automatic AC Cars: 10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ ఏసీ కార్లు.. సింగిల్ బటన్ నొక్కితే సిమ్లా లాంటి ఫీలింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News