IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..
Virat Kohli Serious On KS Bharat: నాలుగో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీ వైపు దూసుపోతుండడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కోహ్లీ సెంచరీకి ముందు కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. సింగిల్ కోసం ముందుకు వచ్చిన తరువాత భరత్ నో చెప్పడం కోహ్లీ ఆగ్రహానికి కారణమైంది.
Virat Kohli Serious On KS Bharat: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేశాడు. 241 బంతుల్లో 100 రన్స్ చేశాడు. మూడేళ్ల తరువాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ చేయగా.. కెరీర్‌లో 28వ టెస్ట్ శతకం. అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ. కోహ్లీ భారీ శతకంతో టీమిండియా పటిష్టస్థితికి చేరుకుంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రవీంద్ర జడేజా 28 పరుగులు చేసి ఔట్ అవ్వగా.. అనంతరం కేఎస్ భరత్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చక్కగా స్ట్రైక్ రోటెట్ చేస్తున్న సమయంలో టాడ్ మర్ఫీ వేసిన 118వ ఓవర్‌లో స్లో షాట్ ఆడి సింగిల్ కోసం పరిగెత్తాడు. అవతలి ఎండ్‌లో ఉన్న భరత్.. కొంచెం ముందుకు వచ్చి మళ్లీ కోహ్లీకి నో చెప్పాడు. అప్పటికే చాలా ముందుకు వచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.
కేఎస్ భరత్ పిచ్ మధ్యలోకి వచ్చిన తరువాత నో చెప్పడంతో విరాట్ కోహ్లీకి కోపం తెప్పించింది. క్రీజ్‌లో వెళ్లిన వెంటనే భరత్ వైపు సీరియస్‌గా చూశాడు. భరత్ కూడా స్పందించి తల వంచి క్షమాపణలు చెప్పాడు. కోహ్లి ఇలాగే ఔటై ఉంటే బహుశా సెంచరీ పూర్తి అయ్యేది కాదు. భరత్ చేసిన ఒక్క తప్పిదం వల్ల విరాట్ కోహ్లీ కల చెదిరిపోయేది. టెస్ట్ సెంచరీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చేంది. అయితే అంతా సవ్యంగా సాగడంతో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు. కేఎస్ భరత్ (44) అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. టీమిండియా కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. నాలుగో రోజు ఆటలో ప్రస్తుతానికి 8 వికెట్లు కోల్పోయి 570 పరుగులు చేసింది. ఆసీస్ కంటే 90 పరుగులు ఆధిక్యంలో ఉంది. కోహ్లీ (185) డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. అక్షర్ పటేల్ (79) పరుగులు చేసి ఔట్ అవ్వగా.. కోహ్లీకి తోడు మహ్మద్ షమీ క్రీజ్‌లో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా లేకపోవడంతో బ్యాటింగ్‌కు దిగలేదు.
Also Read: India Vs Australia: అహ్మదాబాద్ టెస్టులో భారత్ జోరు.. ఆసీస్‌కు దీటుగా..
Also Read: Virat Kohli: మూడేళ్ల తరువాత నెరవేరిన కోరిక.. అహ్మదాబాద్‌లో కోహ్లీ చారిత్రాత్మక ఇన్నింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి