Sarfaraz Khan: మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద.. సర్ఫరాజ్ ఖాన్‌కు హ్యాండిచ్చిన సెలెక్టర్లు
Australia Tour Of India: గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా.. అవగింజ అదృష్టం ఉండాలంటారు. యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇదే నిజమనిస్తోంది. మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నా అతనికి సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం లేదు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Australia Tour Of India: ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమ్ ఇండియాను ప్రకటించారు. అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసినా.. ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. దేశవాళీ క్రికెట్‌లో గత మూడు సీజన్‌లుగా నిలకడగా రాణిస్తున్నా పట్టించుకోలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని బ్యాటింగ్ సగటు 80+ ఉండడం గమనార్హం.
సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 52 ఇన్నింగ్స్‌ల్లో 3380 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒకసారి ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 80.47గా ఉంది. గత మూడు సీజన్‌లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ 2019-20లో 155 సగటుతో 928 పరుగులు చేశాడు. 2021-22 సీజన్‌లో మరోసారి 123 సగటుతో 900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2022-23 సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.
ఈ 25 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చూసి.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో.. ఆసీస్‌తో సిరీస్‌కు గ్యారంటీ ప్లేస్ ఉంటుందని అనుకున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన గణాంకాలు ఉన్నా.. చోటు దక్కించుకోకపోవడంపై క్రికెట్ నిపుణులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. సెలెక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియాతో భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.
Also Read: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి