Harbhajan Singh Indian Playing XI For WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్ల ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు పలువురు సీనియర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరు ఏ జట్టు విజేతగా నిలుస్తుందోనని అంచనా వేస్తుంటే.. మరికొందరు ప్లేయింగ్ ఇలా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తన భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా తుది జట్టుకు సంబంధించి హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. సీనియర్ ప్లేయర్ పుజారాను మూడో స్థానానికి ఎంపిక చేశాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. చాలాకాలం తరువాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న అజింక్యా రహానే ఐదో స్థానంలో ఉంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రహానే.. తన బ్యాట్‌తో దుమ్ములేపాడు. దీంతో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో టెస్ట్ జట్టులోకి పిలుపువచ్చింది. 


అయితే వికెట్ కీపర్‌గా కేఎస్‌ భరత్ స్థానంలో ఇషాన్‌ కిషన్ ఉండాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ఆరోస్థానంలో ఇషాన్ కిషన్ కీలకంగా మారతాడని.. టీమిండియాకు గేమ్‌ ఛేంజర్ కావాలంటే ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఈ స్థానంలో కేఎల్ రాహుల్ ఉంటే అతనికే మద్దతు ఇచ్చేవాడనని.. కానీ గాయం కారణంగా తప్పుకున్నాడని చెప్పాడు. ఇషాన్ కిషన్ అకస్మాత్తుగా టీమ్‌లోకి వచ్చాడని.. కానీ క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడని అన్నారు. కొత్త బంతిని ఎలా ఆడాలో ఇషాన్‌కు తెలుసు అని.. రిషబ్‌ పంత్‌లా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం కూడా కలిసి వస్తుందన్నాడు. 


Also Read: WTC Final మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దయితే విజేత ఎవరంటే..?  


సర్ జడేజా ఏడో స్థానంలో ఉంటాడని ఈ దిగ్గజ స్పిన్నర్ తెలిపాడు. జడేజాను ఎంతగా పొగిడినా తక్కువేనని అన్నాడు. ఐపీఎల్‌లో బాగా బౌలింగ్ చేయడంతోపాటు ఫైనల్‌ మ్యాచ్‌లో సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని ఛాంపియన్‌గా మార్చాడని అభినందించాడు. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్‌ని ఎంపిక చేస్తున్నట్లు చెప్పాడు. శార్దూల్ ఠాకూర్‌ ఎనిమిదో స్థానంలో ఉండాలని.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉందన్నాడు. మ్యాచ్ రోజు వాతావరణం పొడిగా ఉంటే ఆలోచించకుండా అశ్విన్‌ను రెండో స్పిన్నర్‌గా ఎంపిక చేయలన్నాడు. అతను కూడా బ్యాటింగ్ కూడా చేయగలడని అన్నాడు. ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లను తీసుకోవాలని చెప్పాడు.


హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన ప్లేయింగ్ 11 ఇలా: 


రోహత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్.


Also Read: Telangana- Andhra Super fast Railway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి