Ind Vs Aus Day 4 Highlights: డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా ఎవరు నిలుస్తారో నేడు తేలిపోనుంది. ఐదో రోజు ఆటలో ఏ జట్టు పైచేయి సాధిస్తే వారిదే విజయం. టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం అవ్వగా.. ఆస్ట్రేలియా గెలుపొందాలంటే 7 వికెట్లు తీయాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (44), అజింక్యా రహానే (20) ఉన్నారు. కంగారూ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా బరిలోకి దిగింది. చివరిరోజు భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేశాడు ఓ యువకుడు. రింగ్ తొడిగి.. లిప్ కిస్ ఇచ్చాడు. యువకుడి ప్రపోజ్‌కు ఆశ్చర్యపోయిన యువతి.. వెంటనే ఒకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. పాంటింగ్ వ్యాఖ్యానిస్తూ.. ప్రస్తుతం హైలెట్ అయ్యేందుకు ఏదైనా చేయడానికి సిద్ధంగా అన్నాడు. ఆ అబ్బాయి తన ప్రియురాలికి ఉంగరం తొడిగిన ఆ సమయంలో స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టి అభినందించారు. టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా లైవ్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.


 




చివరి రోజు ఆటలో ఏం జరుగుతోందనని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్‌ శర్మ (43) దూకుడుగా ఆడగా.. శుభ్‌మన్‌ గిల్ (18), ఛెతేశ్వర్‌ పుజారా (27) మళ్లీ విఫలం అయ్యారు. ప్యాట్ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, నాథన్‌ లైయన్‌ చెరో వికెట్ పడగొట్టారు. చివర రోజు ఆసీస్‌ పేస్‌ను కాచుకుని.. స్పిన్నర్ నాథన్ లైయన్‌ను ఎదుర్కొని టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎలా నిలబడతారో చూడాలి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.  


Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  


Also Read: Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్‌ 2023.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి