India Vs Pakistan Asia Cup 2023: ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగనుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌లో టీమిండియా అడుగుపెట్టేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అవసరం అయితే పాక్ జట్టు లేకుండా కూడా ఇతర వేదికల్లో ఆసియా కప్ 2023 నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఈ విషయంపై ఇన్నాళ్లు బెట్టు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. భారత్ తమ దేశంలో పర్యటించకుంటే.. తాము వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని కూడా బెదిరించింది. ఇలాంటి తాటకు చప్పుళ్లకు బీసీసీఐ ఎందుకు భయపడుతుంది. 'మీరు ఏమైనా చేసుకోండి.. మా జట్టు మాత్రం పాక్‌లో క్రికెట్ ఆడేది మాత్రం లేదు.' అని తేల్చిచెప్పింది. ఇక చేసేదిలేక పాక్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు సరికొత్త ప్రతిపాదన పంపించింది.
టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో.. భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించాలని హైబ్రిడ్ మోడల్‌ను ప్రపోజ్ చేసింది. ఈ మేరకు అంగీకారం తెలిపిన ఏసీసీ.. జూన్ 13న టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌పై అధికారికంగా ప్రకటించనుందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. హైబ్రిడ్ మోడల్ కింద ఆసియా కప్ 2023లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు పాకిస్థాన్ vs నేపాల్, బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, శ్రీలంక vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహించే ఛాన్స్ ఉంది.
ఇక అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగుతాయి. టీమిండియా జట్టు అన్ని మ్యాచ్‌లు శ్రీలంక వేదికగానే నిర్వహించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 కోసం హైబ్రిడ్ మోడల్‌లో రెండు ఆప్షన్లను ప్రతిపాదించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. మొదటి ఆప్షన్ ప్రకారం.. పాకిస్థాన్ అన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలలో ఆడుతుంది. టోర్నమెంట్ రెండు దశలుగా విభజించాలని రెండో ఆప్షన్‌గా సూచించింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని.. భారత్ మ్యాచ్‌లతోపాటు మిగిలిన మ్యాచ్‌లు రెండో రౌండ్‌లో తటస్థ వేదికలపై నిర్వహించాలని ప్రతిపాదించింది. భారత్ ఫైనల్‌కు చేరుకుంటే.. ఈ మ్యాచ్‌కు కూడా శ్రీలంకలోనే జరగనుంది.
Also Read: Ind vs Aus Day 4 Highlights: గెలుపు ఊరిస్తోంది.. ఓటమి భయపెడుతోంది.. ఉత్కంఠభరితంగా డబ్ల్యూటీసీ ఫైనల్
ఆసియా కప్ 2023 సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌తో సహా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2022 ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 రౌండ్‌కు చేరుకుంటాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్, పాక్ జట్లు ఫైనల్‌కు చేరితే.. మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.
Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook