India Vs Australia Playing 11 Live Updates and Live Streaming Details: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి పోరు జరగనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియా జట్టు 66.67 శాతం పాయింట్లతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మొదటి స్థానంలో నిలిచింది. 58.8 శాతం పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో నిలిచి.. ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన భారత్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. 2:30 గంటలకు టాస్ వేస్తారు. తొలి సెషన్ ఆట మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్ 5:40 నుంచి 7:40 వరకు.. చివరి సెషన్ 8 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. నేటి నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ చారిత్రాక మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే.. ఆరో రోజుకు మ్యాచ్‌ను పొడగిస్తారు. 


ఈ మ్యాచ్‌ కోసం గ్రేడ్ 1 డ్యూక్ బాల్‌ను ఉపయోగించనున్నారు. ఇది స్వింగ్ బౌలర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.  మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మొబైల్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో కూడా చూడొచ్చు.


టీమిండియా విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ పరిస్థితులను తట్టుకుని బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ బ్యాట్‌తోపాటు తన నాయకత్వంతో జట్టును ముందుండి నడింపిచాల్సిన బాధ్యత ఉంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ సూపర్‌ ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా అనుభవలేమితో ఆసీస్‌ పేస్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తే.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీనియర్లు పూజరా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే టీమిండియా గట్టెక్కుతుంది. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారో చూడాలి. 


స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జడేజాపై జట్టు మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. మహ్మద్ షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్‌లతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. రెండ్ఓ స్పిన్నర్ అవసరం అనుకుంటే.. శార్దుల్ స్థానంలో అశ్విన్‌ను ఆడించొచ్చు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఈ ఇద్దరికి ఉంది. 


అటు కంగారూ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. డేవిడ్ వార్నర్‌, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్‌, స్టీవ్ స్మిత్‌ టాప్-4 బ్యాట్స్‌మెన్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీలతో కూడా ప్రమాదకరమే. పేస్ త్రయం పాట్ కమ్మిన్స్, మిచెట్ స్టార్క్, స్కాట్ బోలాండ్‌ టీమిండియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉండడంతో ఈ ముగ్గురిని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెను సవాలే. స్పిన్నర్‌ నాథన్ లయోన్‌తో కూడా డేంజరే. ఈ మాత్రం అవకాశం దక్కినా.. క్షణాల్లో మలుపు తిప్పేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.


Also Read:  IND vs AUS Dream11 Prediction Today: ఆసీస్‌తో ఫైనల్‌ ఫైట్‌కు భారత్ రెడీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్, హెడ్ టు హెడ్ రికార్డులు..!
 
తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.


ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లయోన్, స్కాట్ బోలాండ్.


Also Read:  Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook