Faf du Plessis says I never seen a Batter like Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ప్రశంశల వర్షం కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సూర్య ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బ్యాటింగ్ చేయడం అద్భుతమన్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా షాట్లు కొట్టగల బ్యాటర్‌ను గతంలో ఎప్పుడూ చూడలేదన్నాడు. సూర్యకుమార్‌ను నియంత్రించవచ్చని ఏ బౌలర్ అయినా అనుకుంటే.. అది పొరపాటే అవుతుందని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌ విజయాల్లో సూర్యకుమార్ యాదవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టాప్‌ బ్యాటర్లు విఫలమైన సమయాల్లో సునాయాసంగా రన్స్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై 40 బంతుల్లో 68 పరుగులు చేసి ఔరా అనిపించాదు. బంగ్లాదేశ్‌పై 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌పై 25 బంతుల్లో 51 పరుగులు బాదాడు. మైదానం నలువైపులా షాట్ల కొట్టగల సమర్థుడని ఇప్పటికే మాజీలు సూర్యను కొనియాడారు. మిస్టర్ 360 అనే పేరు కూడా పెట్టారు. తాజాగా ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా సూర్య అద్భుత ఆటగాడు అని పేర్కొన్నాడు. 



'సూర్యకుమార్ యాదవ్‌ అద్భుత బ్యాటర్. మైదానం నలు మూలలా షాట్లు కొట్టగలడు. ఫలానా బంతి వేస్తే సూర్యను నియంత్రించవచ్చని ఏ బౌలరూ అనుకోకూడదు. ఎందుకంటే సూర్య వద్ద అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యం ఉంది. పిచ్‌పై విభిన్న ప్రాంతాల్లో పడిన బంతికి విభిన్నమైన షాట్లతో పరుగులు చేస్తాడు. సూర్య ప్రశాంతత నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అమ్ముల పొదిలో విభిన్న షాట్లను తొందరపాటుకు గురికాకుండా ఆడగలడు. మ్యాచ్‌కు అనుగుణంగా బ్యాటింగ్‌ చేయడం అద్భుతం. సైలెంట్‌గా పని ముగిస్తాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో సూర్యనే అత్యుత్తమ ఆటగాడు' అని ఫాఫ్‌ డుప్లెసిస్‌ అన్నాడు. 


Also Read: Fake Fielding: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌ వల్లే మేం ఓడిపోయాం.. బంగ్లాదేశ్‌ ప్లేయర్ ఆరోపణలు!  


Also Read: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దిగ్గజం సచిన్‌ రికార్డు బద్దలు! కింగ్ ఖాతాలో మరిన్ని రికార్డులు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook