IND Vs BAN Dream11 Prediction Today Match: బంగ్లాదేశ్‌నూ చితక్కొడతారా..? మరికాసేపట్లో పోరు.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
India Vs Bangladesh Playing11 and Dream11 Team Tips: నేడు బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్లలో ఎవరు ఉంటారు..? ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా తీసుకోవాలి..? వంటి వివరాలు మీ కోసం..
India Vs Bangladesh Playing11 and Dream11 Team Tips: వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోరు మీదు ఉన్న టీమిండియా.. మరో విజయంపై కన్నేసింది. నేడు బంగ్లాదేశ్‌ను ఢీకొంటోంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించిన భారత్.. బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. అటు బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో గెలిచి.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. భారత్‌పై విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. బంగ్లాదేశ్ చిన్న జట్టే అయినా.. కొంచెం ఛాన్స్ ఇచ్చినా చెలరేగుతుంది. టీమిండియా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉండడంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? ప్లేయింగ్11 లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్..
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. నల్ల మట్టితో ఉండడంతో మంచి బౌన్స్ ఉంటుంది. బాల్ బ్యాట్‌పైకి వచ్చే అవకాశం ఉండడంతో బ్యాట్స్‌మెన్ పండుగ చేసుకుంటారు. 300 పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మంచు కురిసే ఛాన్స్ లేకపోవడంతో టాస్ గెలిచిన జట్టుకు అదనపు ప్రయోజనం ఉండదు. ఈ పిచ్‌పై గత ఏడు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 300 కంటే ఎక్కువ పరుగులు చేశాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 4 విజయాలు సాధించగా.. ఛేజింగ్ జట్టు 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
==> వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, మెహిది హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
డ్రీమ్ 11 టీమ్ ఇలా..
వికెట్ కీపర్: లిట్టన్ దాస్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, మహ్మదుల్లా
ఆల్ రౌండర్లు: షకీబ్ అల్ హసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.