విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే చిత్రంగా అనిపిస్తోంది.. ఊహకే అందడంలేదు! ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాట్సన్
IND vs BAN, Virat Kohli stats ridiculous says Shane Watson. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Shane Watson says Virat Kohli is a freak and his stats are super freakish: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. మెగా టోర్నీ సూపర్ 12లో భాగంగా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులో 220 రన్స్ బాదాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ముఖ్యంగా పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక బుధవారం బంగ్లాదేశ్‌పై 64 పరుగులు చేయడంతో.. కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు. కెరీర్‌లో ఐదో టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 1065 పరుగులు బాదాడు. దాంతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు) రికార్డు బద్దలు అయింది. కోహ్లీ మొత్తంగా 113 టీ20 మ్యాచులో 3932 రన్స్ చేశాడు.
విరాట్ కోహ్లీ రికార్డ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో కోహ్లీ వెయ్యి పరుగులు చేశాడంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా అని పేర్కొన్నాడు. స్టార్‌లో వాట్సన్ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ టోర్నీలో 80కి పైగా సగటుతో 1000 పరుగులకు పైగా చేయడం అసాధ్యం. విరాట్ కోహ్లీ ఈ ఘనత అందుకోవడంను నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా. టీ20లు అంటేనే చాలా రిస్క్‌తో కూడుకున్నవి. అందులోనూ బ్యాటింగ్ అంటే మరింత కష్టం. ఇన్ని మ్యాచ్‌లు కోహ్లీ ఎలా ఆడాడో ఊహకే అందడం లేదు' అని అన్నాడు.
'విరాట్ కోహ్లీ భారత దేశం కోసం ఎంతో సాధించిపెట్టాడు. కోహ్లీ గణాంకాలు చూస్తే చిత్రంగా అనిపిస్తోంది. క్లిష్టమైన ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ ఇన్ని పరుగులు చేయడం గ్రేట్. కోహ్లీ అద్భుత బ్యాటర్' అని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ కోహ్లీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 3932 పరుగులు చేశాడు.
Also Read: భారత్ మాతాకీ జై అంటూ.. హిందీ మాట్లాడుతున్న విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్! వైరల్ వీడియో
Also Read: Governor Arif Mohammad Khan: కేరళలో ముదిరిన వివాదం.. ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook