Kohli China Fan: భారత్ మాతాకీ జై అంటూ.. హిందీ మాట్లాడుతున్న విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్! వైరల్ వీడియో
IND vs BAN, Virat Kohli China fan speaks hindi. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్ అయిన ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
Virat Kohli China fan speaks hindi very well: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారాల్సిందే, రికార్డుల మోత మోగాల్సిందే. హాఫ్ సెంచరీలు, సెంచరీలను కూడా మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 71 శతకాలు బాదిన ఘనత కోహ్లీది. కోహ్లీ తన బ్యాటింగ్‌తో ఎందరో అభిమానులను సంపాదించాడు. కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. పొరుగు దేశం చైనాలో కూడా కోహ్లీకి డై హార్డ్ ఫాన్స్ ఉన్నారు.
అడిలైడ్ వేదికగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు. చైనా యువకుడు తన బుగ్గలపై మువ్వన్నెల పతాకం పెయింట్ వేసుకున్నాడు. మ్యాచ్ ఆసాంతం భారత్‌కు మద్దతుగా నిలిచాడు. చైనాకు చెందిన యువకుడు అడిలైడ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. విరాట్ కోహ్లీకి డై హార్డ్ ఫాన్ అయిన అతడు కింగ్ కోహ్లీని చూసేందుకు మ్యాచుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ అంటే తనకు అభిమానమని, తన ఆట బాగా నచ్చుతుందని చెప్పాడు. కోహ్లీ కోసం సదరు యువకుడు హిందీలో మాట్లాడడం విశేషం.
భారత దేశం, అక్కడి సంస్కృతి అన్నా చాలా ఇష్టమని చైనా యువకుడు చెప్పాడు. 'మై ఇండియన్ టీమ్ కీ భక్త్ హూ. ముఝే భారతీయ సంస్కృతి బహుత్ పసంద్ హై' అని అతడు చెప్పాడు. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటే అభిమానం అని, విరాట్ ఆట బాగా ఎంజాయ్ చేస్తానని హిందీలో చెప్పాడు. బంగ్లాపై భారత్ గెలుస్తుందని కూడా చెప్పాడు. భారత్ అంటే చాలా ఇష్టమని, అందుకే హిందీ నేర్చుకున్నానని చెప్పాడు. చివరగా 'భారత్ మాతా కీ జై' అని చెప్పాడు. చైనా యువకుడు హిందీ మాట్లాడడం చూసిన అక్కడి భారత ఫాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని 'Express Sports' తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
Also Read: Fake Fielding: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్లే మేం ఓడిపోయాం.. బంగ్లాదేశ్ ప్లేయర్ ఆరోపణలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook