Ind vs Eng 02nd Test: ఇంగ్లాడ్‌తో జరిగిన తొలి టెస్టు ఓటమి నుంచి ఇంకా కోలుకొని టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తొడ కండరాల నొప్పి కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అదనపు పరుగు కోసం వేగంగా పరిగెత్తడంతో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బందిపడుతూనే అతడు మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడు నొప్పి ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. దీనిపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఫిజియోను ఇంకా సంప్రదించలేదని.. అతడి పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నాడు. జడ్డూ గాయం తీవ్రతపై బీసీసీఐ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. నేడో, రేపో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో నాలుగు రోజుల్లో(ఫిబ్రవరి 2) విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మెుదలుకానుంది. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా? అనేది అనుమానంగానే కన్పిస్తోంది. జట్టుతో కలిసి జడేజా వైజాగ్ కు వెళ్తాడా లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపిస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌ స్టోక్స్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో జడ్డూను రనౌట్‌ చేయడం మ్యాచ్‌ను టర్న్ చేసింది. రెండో టెస్టుకు అతడు లేకపోవడం టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. తొలి టెస్టులో జడేజా 87 పరుగులు చేయడంతోపాటు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు కూడా తీశాడు. మెుదటి టెస్టులో ఇంగ్లాండ్‌ స్పిన్‌ ధాటికి కుప్పకూలిన  రోహిత్‌ సేన.. వైజాగ్ టెస్టులో ఎలా ఆడుతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 


Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook