IND vs ENG 01st Test Match: ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదేళ్ల తర్వాత భాగ్యనగరం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) గుడ్ న్యూస్ చెప్పింది. తొలి టెస్టు మ్యాచ్ ను స్కూల్‌ స్టూడెంట్స్‌తోపాటు ఆర్మీ జవాన్లకు ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని శనివారం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''మేము హెచ్‌సీఏలో ఎన్నికైన తర్వాత నిర్వహించబోతున్న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఇది. మ్యాచ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అధునాతన హంగులతో స్టేడియాన్ని తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మ్యాచ్‌ను ఉచితంగా చూపించాలని నిర్ణయించాం. మ్యాచ్‌ చూడాలనుకునే వారు స్కూల్ నుంచి లెటర్‌ తీసుకురావాలి. ఒక స్కూల్‌కు ఒక్క రోజు మాత్రమే అవకాశముంటుంది..'' అని తెలిపారు. 


స్కూల్‌ పిల్లల టికెట్ల కోసం ప్రత్యేకమైన డెస్క్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు.  విద్యార్థులతో పాటు ఆర్మీ, నేవి అధికారులను కూడా ఈ మ్యాచ్ కు అనుమించబోతున్నారు. మ్యాచ్ ను చూడాలనుకునేవారు సంబంధిత విభాగాధిపతితో సంతకం చేయించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ కోసం 26 వేల వరకు టికెట్స్ విక్రయించినట్లు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. ఫిజికల్‌ గా టికెట్లు కావాలనుకునేవారు జింఖానా గ్రౌండ్స్‌లో ఇస్తున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో చివరిసారిగా టీమిండియా 2018లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆడింది. 


Also Read: Shoaib Malik Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్


Also Read: IPL Sponsorship: ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా మళ్లీ టాటానే.. BCCIకి ఏటా 500 కోట్ల ఆదాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter