లార్డ్స్‌లో శనివారం భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియాపై 86 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆతరువాత 323 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త జట్టు 50 ఓవ‌ర్లకు 236 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 86 ప‌రుగుల తేడాతో భార‌త్‌పై ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది. కాగా..ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


ఇంగ్లాండ్ జట్టులో జో రూట్‌ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్‌), మోర్గాన్‌ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్‌), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. బారత బౌలర్లలో కుల్దిప్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు అంతంతమాత్రంగా ఆడారు. రోహిత్‌ 15, ధావన్‌ 36, కోహ్లీ 45, రైనా 46, ధోనీ 37 పరుగులు చేశారు.  రాహుల్‌ డకౌటయ్యాడు. మొత్తానికి భారత ఇన్నింగ్స్‌ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్‌‌గా ముగిసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు జో రూట్‌ దక్కించుకున్నాడు. మూడో వన్డే మంగళవారం జరుగనుంది.