IND vs ENG 2nd Test Live Score Updates: తొలి టెస్టులో తేలిపోయిన  టీమిండియా బౌలర్లు రెండో టెస్టులో సత్తా చాటారు. తొలి టెస్టులో పరుగుల వరద పారించిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను రెండో టెస్టులో 150 పరుగుల కూడా చేయకుండా ఆలౌట్ చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (5/43) 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు చెపాక్ వేదికగా ఇంగ్లాండ్(England Cricket Team) జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు రోహిత్ శర్మ(161; 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 300/6కు పరిమితమైంది. ఓవర్‌‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 29 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది.


Also Read: Sachin Tendulkar తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ, IPL 2021 వేలం ముందే షాక్



రిషబ్ పంత్(58 నాటౌట్; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ మరో ఎండ్‌లో త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యారు. దీంతో భారత్ 329 పరుగులకు ఆలౌట్ అయింది.టీమిండియా స్పిన్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దాసోహమయ్యారు. తొలుత టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తొలి ఓవర్లోనే ఖాతా తెవరకుండానే ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆపై మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16)తో అశ్విన్ తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. 


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే..


తొలి టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్, ఇషాంత్, మహ్మద్ సిరాజ్ నుంచి సహకారం అందడంతో ఇంగ్లాండ్ పతనాన్ని అశ్విన్ శాసించాడు. ఇషాంత్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో‌ 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ కాగా, కీపర్ బెన్ ఫోక్స్ టాప్ స్కోరర్. 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్(Team India)‌కు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యం లభించింది.


Also Read: Virat Kohli కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన England మాజీ క్రికెటర్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook