IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే..

ఐపీఎల్ 2021 14వ సీజన్ ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. అన్ని టీమ్స్ ఆటగాళ్లను రిటర్న్ చేయడం, రిలీజ్ చేయడం అయిపోయింది. మినీ ఆక్షన్ ఇక ఫిబ్రవరి 18న జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టీ ఆ ఆటగాళ్లపైనే పడింది.  వేలంలో ఈ ఆటగాళ్లే ఎక్కువ ధర పలకనున్నారు. ఇంతకీ జరగబోయే ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో అత్యధిక ధర పలకనున్న ఆటగాళ్లెవరో చూద్దామా
  • Feb 10, 2021, 23:27 PM IST

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 14వ సీజన్ ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. అన్ని టీమ్స్ ఆటగాళ్లను రిటర్న్ చేయడం, రిలీజ్ చేయడం అయిపోయింది. మినీ ఆక్షన్ ఇక ఫిబ్రవరి 18న జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టీ ఆ ఆటగాళ్లపైనే పడింది.  వేలంలో ఈ ఆటగాళ్లే ఎక్కువ ధర పలకనున్నారు. ఇంతకీ జరగబోయే ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో అత్యధిక ధర పలకనున్న ఆటగాళ్లెవరో చూద్దామా

1 /6

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ ఆరోన్ పించ్ గత సీజన్‌లో ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. అందుకే ఆర్సీబీ ఇతడిని రిలీడ్ చేసేసింది. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో వేలంలో పించ్ కోసం పోటీ ఉండవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ , కేకేఆర్, పంజాబ్ జట్లు అతడి కోసం తీవ్రంగా ప్రయత్నించవచ్చు.

2 /6

ఆర్సీబీ ఆల్ రౌండర్ మొయీన్ అలీ కూడా ఈసారి మరో టీమ్‌లో చేరవచ్చు. ఎందుకంటే అతడిని కూడా టీమ్ రిలీజ్ చేసింది. అతడి ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే..19 మ్యాచ్‌లలో 309 పరుగులు సాధించి..పది వికెట్లు తీసుకున్నాడు.

3 /6

క్రిస్ మోరిస్...కోసం ఈసారి జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. మోరిస్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. అంతేకాదు..అద్భుతమైన బ్యాటింగ్ కూడా క్రిస్ మోరిస్ సొంతం. మోరిస్ ఆల్ రౌండర్ కావడంతో జట్టుకు వరమవుతుంది. ఈ కారణంగా ఫ్రాంచైజీలు ఇతడిని ఎక్కువ ధర చెల్లించి తీసుకోవచ్చు.

4 /6

ఐపీఎల్ వేలం 2021 సమయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భారీ వేలానికి వెళ్లవచ్చు. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ అతడిని రిలీజ్ చేసింది. ఈ సమయంలో స్మిత్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ సహా చాలా జట్లకు ఓపెనర్  అవసరం ఉంది. ఇతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీల మధ్య పోరు ప్రారంభం కావచ్చు.

5 /6

గ్లేన్ మ్యాక్స్‌వెల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఫ్లాప్ అయ్యాడు. చాలాసార్లు ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడికి టీమ్ అవకాశమిచ్చింది. కానీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఈ నేపధ్యంలో పంజాబ్ జట్టు అతడిని రిలీజ్ చేసేసింది. మ్యాక్స్‌వెల్ కూడా గొప్ప  ఆటగాడే. అతడి హిట్టింగ్‌పై ఎవరికీ అనుమానం లేదు. ఈ సీజన్‌లో వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం వేలం ఎక్కువగానే ఉండవచ్చు.

6 /6

కేదార్ జాదవ్. గత సీజన్‌లో నిరాశాజనకమైన ప్రదర్శన చూపించిన ధోనీ టీమ్  సీఎస్‌కే‌కు చెందిన కేదార్ జాదవ్ వేలానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు 87 మ్యాచ్‌లలో 1141 పరుగులు సాధించాడు.