IND vs ENG 3rd Test live, Day 02:  రాజ్‌కోట్‌ టెస్టులో స్టోక్స్ సేన ధీటుగా  బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ను దూకుడుగా ఆరంభించింది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ భారత్ బౌలర్లను చితక్కొట్టాడు. అతడు కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేసి ఇంగ్లండ్ కు మెరుపు ఆరంభన్నిచ్చాడు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన డకెట్ 118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు సహాయంతో 133 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో ఓపెనర్ క్రాలే 15 పరుగులకే ఔటయ్యాడు. ఇతడి తర్వాత క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్ డకెట్ కు చక్కటి సహకారమందించాడు. వీరిద్దరూ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ఒలీ పోప్‌ 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 39 పరుగుల చేసి సిరాజ్ కు చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమాయనికి 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.


Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన


తొలి రెండు టెస్టుల్లో విఫలమైన డకెట్ మూడో టెస్టులో మాత్రం చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు కొట్టాడు. అతడు దూకుడుకి టీమిండియా స్టార్ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌ (6 ఓవర్లలో 42 రన్స్‌), సిరాజ్‌ (10 ఓవర్లలో 54 రన్స్‌), జడేజా (4 ఓవర్లలో 33 రన్స్‌) ఇచ్చారంటే డకెట్ బాదుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మూడో రోజు డకెట్ ను కట్టడి చేస్తేనే భారత్‌కు ఈ టెస్టులో పట్టుబిగించే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: Ind vs Eng: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. ఎంత స్కోరు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter