IND vs ENG 4th Test: నాలుగో టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్న టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆ యువ ఆటగాడు ఔట్.
IND vs ENG 4th Test: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో గెలిచి 2-1తో లీడ్ లో ఉన్న టీమిండియాకు నాలుగో టెస్టుకు ముందు ఓ శుభవార్త వచ్చింది. రాంచీ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరంటే?
Ranchi Test Updates: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 లీడ్ ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉప్పల్ టెస్టులో గాయపడి.. వైజాగ్, రాజ్ కోట్ టెస్టులకు దూరమైన స్టార్ ప్లేయర్ రాహుల్ నాలుగో టెస్టులో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాహుల్ జట్టులోకి వస్తే రోహిత్ సేన బ్యాటింగ్ బలం పెరుగుతుంది.
అతడిపై వేటు!
మూడో టెస్టుకు రాహుల్ ఫిట్ లేకపోవడంతో అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే రాహుల్ జట్టులోకి వస్తే ఎవరపై వేటు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రెండు, మూడో టెస్టుల్లో దారుణంగా విఫలమైన రజత్ పాటిదార్ ను పక్కనే పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన జడేజా మూడో టెస్టులో అదరగొట్టాడు. సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసి ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మరి రాహుల్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
వ్యక్తిగత కారణాలతో సిరీస్ మెుత్తానికి దూరమైన కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్ ను తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండో టెస్టులో 32 పరుగులు, మూడో టెస్టులో 5 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా అతడిని రాంచీ టెస్టు నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Jasprit Bumarh: రాంచీ టెస్టుకు బుమ్రా దూరం.. అతడి స్థానంలో ఎవరంటే?
వారి స్థానాలు పదిలం..
ఆరంగ్రేటంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్, ధ్రువ్ స్థానాలకు ఎటువంటి ఢోకా లేదు. రోహిత్, యశస్వి ఎప్పటిలాగే ఓపెనింగ్ చేస్తారు. ఫస్ట్ డౌన్ లో గిల్.. సెకండ్ డౌన్ లో రాహుల్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ జడేజా ఉండనే ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. సిరాజ్, కులదీప్, అశ్విన్ కొనసాగొచ్చు. బుమ్రా స్థానంలో ముకేష్ ను తీసుకోవచ్చు.
Also Read: రాజ్‌కోట్ మనదే.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook