Jasprit Bumarh: రాంచీ టెస్టుకు బుమ్రా దూరం.. అతడి స్థానంలో ఎవరంటే?

Jasprit Bumarh: రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత్ స్పీడ్‌స్ట‌ర్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 09:15 PM IST
Jasprit Bumarh: రాంచీ టెస్టుకు బుమ్రా దూరం.. అతడి స్థానంలో ఎవరంటే?

Ind vs Eng 4th Test: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. ఇదే ఊపులో రాంచీలో జరగబోయే నాలుగో టెస్టుకు ప్రిపేర్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాంచీ టెస్టుకు జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprit Bumarh) దూరం కానున్నాడని తెలుస్తోంది. బుమ్రాపై ఒత్తిడిని త‌గ్గించేందుకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది . రాజ్‌కోట్ నుంచి భార‌త జ‌ట్టు మంగ‌ళ‌వారం రాంచీకి వెళ్ల‌నుంది. బుమ్రా మాత్రం ఇవాళ అహ్మ‌దాబాద్ బ‌య‌లేదేరనున్నాడు. అయితే అత‌డి స్థానంలో ఎవ‌రు ఆడతారనే విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. ఈ యార్క‌ర్ కింగ్ ఆఖ‌రి టెస్టులోనైనా ఆడతాడో లేదో వేచి చూడాలి.  

ఉప్ప‌ల్ టెస్టులో అనుహ్యంగా ఓడిన భార‌త్ వైజాగ్ టెస్టులో దుమ్మురేపింది. య‌శ‌స్వీ జైస్వాల్ డబుల్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. బుమ్రా త‌న మ్యాజిక్ స్పెల్‌తో ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. 9 వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో ఈ స్పీడ్‌స్ట‌ర్‌కు మూడో టెస్టుకు విశ్రాంతినివ్వాల‌ని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్ర‌విడ్ భావించారు. కానీ ముకేశ్ కుమార్ సరిగా బౌలింగ్ చేయకపోవడంతో బుమ్రానే ఆడించాల్సి వచ్చింది. 

మరోవైపు రాజ్ కౌట్ టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన భారత్..  ఇంగ్లండ్ ను 319 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో యశస్వి డబుల్ సెంచరీ చేయడంతో పర్యటక జట్టు ముందు 557 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే స్టోక్స్ సేన ఛేదించలేక 122 పరుగులకే కుప్పకూలింది. జడేజా ఐదు వికెట్లుతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు.  నాలుగో టెస్టు ఫిబ్ర‌వ‌రి 23న రాంచీలో ప్రారంభం కానుంది. బుమ్రా స్థానంలో ముకేష్ మళ్లీ జట్టుతో కలిసే అవకాశం ఉంది. 

Also Read: రాజ్‌కోట్‌ మనదే.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..

Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News