IND vs ENG 5th Test Live: ధర్మశాల టెస్టులో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాంచీ టెస్టులో జట్టును గెలిపించిన శుభ్‌మ‌న్ గిల్ మరోసారి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ పోర్లు, సిక్సర్లుతో విరుచుకుపడుతూ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 48 ఓవర్లలో వికెట్ నష్టపోయి 218 పరుగులు చేసింది. దీంతో స్కోరు సమం అయింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు భారీ స్కోరు దిశగా  దూసుకెళ్తోంది. తొలి రోజు టీమిండియా యువ సంచలనం య‌శ‌స్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచ‌రీ చేసిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు క్రాలే, డకెట్ ఆ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. మంచి జోరుమీదున్న డకెట్ ను కుల్దీప్ ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ డకౌట్ అయ్యాడు. కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన క్రాలే కూడా పెవిలియన్ చేరాడు. బెయిర్ స్టో, రూట్ కాసేపు ప్రతిఘటించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. కుల్దీప్ కు అశ్విన్, జడేజా కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ 5, అశ్విన్ నాలుగు వికెట్లు తీశారు.


భారత స్పిన్నర్ల ఘనత
టీమిండియా స్పిన్నర్లు 48 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టులో తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు యెుక్క పది వికెట్లూ స్పిన్నర్లకే దక్కడం టీమిండియాకు ఇది మూడోసారి మాత్రమే. 1973లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులోనూ, 1976లో న్యూజిలాండ్‌తో అక్లాండ్‌ వేదికగా జరిగిన టెస్టులోనూ ఇదే ఫీట్ రిపీట్ చేశారు భారత స్పిన్నర్లు. 


Also Read: Rohit Sharma: హిట్‌మ్యానా మజాకా... ఒకే రోజు మూడు రికార్డులు కొల్లగొట్టిన రోహిత్..


Also Read: IND Vs ENG: 23 ఏళ్ళ రికార్డు సమం చేసిన జాక్ క్రాలే.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook