IND vs ENG 5th Test Playing 11: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన ఐదవ టెస్ట్ మ్యాచుకు సమయం దగ్గరపడుతోంది. శుక్రవారం (జూన్ 1) నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా.. ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఇక చివరి మ్యాచ్‌ను గెలిచినా.. డ్రా చేసుకున్నా భారత్ సిరీస్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. రోహిత్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడటం దాదాపుగా అసాధ్యమే. బ్యాకప్‌గా మయాంక్ అగర్వాల్‌ ఇంగ్లండ్ వచ్చినా.. ప్రాక్టీస్ లేని అతడిని నేరుగా జట్టులోకి తీసుకోవడం సందేహమే. దాంతో తెలుగు తేప్లేయర్ కేఎస్ భరత్.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ కౌంటీల్లో చెలరేగిన మరో తెలుగు తేజం హనుమ విహారి మంచి ఫామ్ మీదున్నాడు. కాబట్టి విహారి కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 


ఫస్ట్ డౌన్‌లో నయావాల్ చతేశ్వర్ పుజారా ఆడనున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ కనబరుస్తున్న పుజారా.. ఇంగ్లండ్ కౌంటీల్లో డబుల్ సెంచరీలతో సత్తా చాటాడు. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ రానుండగా.. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా హనుమ విహారి ఆడనున్నారు. ఆరో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడనున్నాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగలనుకుంటే ఆర్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. లేదా శార్దూల్ ఠాకూర్ ఆడతాడు. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.


భారత తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, హనుమ విహారి/కేఎస్ భరత్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా. 


డ్రీమ్ ఎలెవన్ టీమ్:
శుభమన్ గిల్ (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, క్రెయిగ్ ఓవర్టన్ ( వైస్-కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, విరాట్ కోహ్లీ, జో రూట్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా. 


Also Read: IPL League: ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై 75 రోజుల పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌!


Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.