Jay Shah says IPL will have 2 And A Half Month window: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్యాన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రెటరీ జై షా గుడ్‌న్యూస్ అందించారు. ఐపీఎల్ 2023ని 75 రోజుల పాటు (రెండున్నర నెలలు) నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుమతి పొందేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ ప్రతిపాదనకు ఐసీసీ కూడా సానుకూలంగానే ఉందన్నారు. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్లానింగ్ జాబితాలో ఈ ప్రతిపాదనను చేరుస్తామని జై షా తెలిపారు.
తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఎజెన్సీతో బీసీసీఐ సెక్రెటరీ జై షా మాట్లాడుతూ... 'ఐపీఎల్‌కు ప్రత్యేకమైన విండో కోసం ఐసీసీ మరియు ఇతర క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నాము. ఈ టోర్నమెంట్ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి సానుకూల స్పందన వస్తుంది. 2023లో రెండున్నర నెలల పాటు ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తాం. అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లందరూ పాల్గొననున్నారు. ఐసీసీ క్యాలెండర్‌లోనూ టోర్నీకి అవకాశం కల్పిస్తాం' అని అన్నారు.
'ఐపీఎల్ టోర్నీని విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందించడమే కాకూండా.. ఇతర అంశాలపై దృష్టి పెడతాం. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్‌కు కట్టుబడి ఉంటుంది. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి జట్లతో మాత్రమే కాకూండా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు ద్వైపాక్షిక పర్యటనలతో సహాయం చేయడానికి మేము ఒక సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించాలనుకుంటున్నాము' అని జై షా చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2022లో ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరిగిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండు నెలల పాటు సాగిన క్యాష్ రిచ్ లీగ్.. ఐపీఎల్ 2022లో మ్యాచ్‌ల సంఖ్య 74 కావడంతో మరిన్ని రోజులు పెరిగాయి. ఇక రానున్న సీజన్‌లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఫ్రాంచైజీలను తీసుకోకుండా ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. ఐపీఎల్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయం పొందిన సంగతి తెలిసిందే.
Also Read: Ram Pothineni Marriage: అయ్యో దేవుడా.. ఇక ఆపండి! పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్
Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.