Sanjana Ganesan reveals Jasprit Bumrah mother reaction: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదవ టెస్ట్‌ (రీ షెడ్యూల్డ్‌) మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌గా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఎంపికయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి బారిన పడిన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. దాంతో 1987 తర్వాత భారత జట్టుకు సారథిగా నియమితుడైన పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత స్పిన్నర్ అనిల్ కుంబ్లే మినహా నాయకులంతా బ్యాటర్లే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికవ్వడం పట్ల అతడి తల్లి దల్జీత్‌ సంతోషం వ్యక్తం చేశారని పేసుగుర్రం సతీమణి సంజన గణేశన్‌ చెప్పారు. సంజన ఐసీసీతో మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని మా అత్తగారు కోరుకునేవారు. చిన్నప్పటి నుంచి అతడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఆమె స్వయంగా చూశారు. బుమ్రా ఇప్పుడు భారత జట్టుకే కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలియగానే ఆమె సంతోషపడ్డారు. ఆమెకు క్రికెట్‌ గురించి పెద్దగా తెలియకపోయినా ఆటలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను చెప్పేవారు' అని చెప్పారు. 


'జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ అనేది అంత తేలిగ్గా రాలేదు. రోహిత్‌ శర్మ తర్వాత ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించగలడా లేదా అని పరిశీలించాకే జట్టు పగ్గాలు వచ్చాయి. రోహిత్‌ తుది జట్టులో ఉండేందుకు యాజమాన్యం చివరి నిమిషం వరకూ ఎదురు చూసింది. అది సాధ్యం కాకపోవడంతో సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అతడికి కెప్టెన్సీ వచ్చింది. అది అర్థం చేసుకునేందుకు బుమ్రాకూ కాస్త సమయం పట్టింది. కెప్టెన్సీ దక్కడంతో బుమ్రా సంతోషంగా ఉన్నాడు. అంతేకాదు చాలా గర్వపడుతున్నాడు' అని సంజన చెప్పుకొచ్చారు. 


Also Read: wo-Headed Snake: అత్యంత అరుదైన రెండు తలల పాము.. గతంలో ఎప్పుడూ చూసుండరు!


Also Read: Pakka Commercial Movie Review: గోపీచంద్- రాశిఖన్నాల సినిమా ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.