IND vs ENG 5th Test Updates:  రేపటి(మార్చి 7, గురువారం)  నుండి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న స్టోక్స్ సేన చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్ జట్టు. ఈసారి స్టోక్స్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రాంచీ టెస్టులో ఆడిన రాబిన్సన్ ను పక్కనబెట్టి స్టార్ పేసర్ మార్క్ వుడ్ ను జట్టులోకి తీసుకుంది. గత టెస్టులో మాదిరిగానే ఈ సారి కూడా ఇంగ్లండ్ జట్టు ఇద్దరు పేసర్లు (అండర్సన్‌, వుడ్‌) ఇద్దరు స్పిన్నర్ల (హర్ట్లీ, బషీర్‌)లతో బరిలోకి దిగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ తో సిరీస్ లో మార్క్ వుడ్ పరిస్థితి మ్యూజికల్‌ చైర్‌లా మారింది. ఉప్పల్ టెస్టులో ఆడిన వుడ్ ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అతడిని వైజాగ్ టెస్టుకు పక్కన బెట్టింది. మళ్లీ రాజ్ కోట్ టెస్టులో ఆడిన వుడ్ ..తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో  మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో నాలుగో టెస్టులో అతడి ప్లేస్ లో ఓలీ రాబిన్సన్ ను తీసుకుంది ఇంగ్లండ్. రాంచీ టెస్టులో బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు రాబిన్సన్. దాంతో అతడిని ధర్మశాల టెస్టుకు పక్కన పెట్టి వుడ్ ను జట్టులోకి తీసుకున్నారు. 


ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్‌ టీమ్: జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌, బెన్‌ ఫోక్స్‌, టామ్‌ హర్ట్లీ, మార్క్‌ వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, షోయబ్‌ బషీర్‌


Also Read: KL Rahul: రాహుల్ ఐపీఎల్ ఆడతాడా? బీసీసీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?


Also Read: T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook