Rohit Sharma: హిట్‌మ్యానా మజాకా... ఒకే రోజు మూడు రికార్డులు కొల్లగొట్టిన రోహిత్..
Rohit Sharma: ధర్మశాల టెస్టులో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా పలు ఘనతలను సాధించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.
IND vs ENG 5th Test-Rohit Sharma: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో రికార్డుల మోత మోగిస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు. ధర్మశాల టెస్టులో యువ సంచలనం యశస్వి జైస్వాల్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా పలు ఘనతలను సాధించారు. తొలి రోజు ఆటలో అటు ఫీల్డర్‌గానే గాక బ్యాటర్‌గా, సారథిగా పలు రికార్డులను నెలకొల్పాడు రోహిత్. ఐదో టెస్టులో మార్క్ వుడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా రోహిత్ 60 క్యాచ్‌లను పూర్తిచేసుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 60 అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో 50 సిక్సర్లు కొట్టిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.
మూడు ఫార్మాట్లలో వెయ్యి పరుగులు..
అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా మూడు ఫార్మాట్లలో వెయ్యి పరుగులు చేసిన మూడో భారత కెప్టెన్ గా, ఓవరాల్ గా ఆరో సారథిగా రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ధోని, కోహ్లీ పేరిట ఉంది. ధోని కెప్టెన్ గా టెస్టులలో 3,454, వన్డేలలో 6,641, టీ20ల్లో 1,112 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ టెస్టులలో 5,864, వన్డేలలో 5,449, టీ20లలో 1,570 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ టెస్టులలో 1,010, వన్డేలలో 2,047, టీ20లలో 1,648 రన్స్ కొట్టాడు.
తొలి రోజు భారత్ దే..
ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. తొలి రోజు భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాళ్లలో క్రాలే ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కుల్దీప్ ఐదు వికెట్లు, అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రోహిత్, జైస్వాల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో రోహిత్ సేన తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 83 పరుగులు వెనుకబడి ఉంది.
Also Read: IND vs ENG: ఇంగ్లండ్ ను కుప్పకూల్చిన కుల్దీప్, అశ్విన్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి, రోహిత్..
Also read: IND Vs ENG: 23 ఏళ్ళ రికార్డు సమం చేసిన జాక్ క్రాలే.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook