IND vs ENG Matches: ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచుల్లో ఎవరు ఎక్కువ గెలిచారో తెలుసా ?
IND vs ENG Matches Winning Rate: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల సక్సెస్ రేటుపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
IND vs ENG Matches Winning Rate: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంకెంతో దూరం లేదు. పాకిస్థాన్ vs న్యూజిలాండ్ జరిగిన సెమీ ఫైనల్ 1 మ్యాచ్‌లో కివీస్ జట్టును పాకిస్తాన్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. ఇక తెలియాల్సిందల్లా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో పాకిస్థాన్‌తో ఏ జట్టు తలపడుతుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరగనున్న ఇండియా vs ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌పై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల సక్సెస్ రేటుపై ఓ లుక్కేద్దాం.
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఇప్పటివరకు ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో భారత్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా ఇంగ్లండ్ జట్టు మరో 10 మ్యాచుల్లో గెలుపు సొంతం చేసుకుంది.
వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇండియా, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్ కాగా రెండో మ్యాచ్ 2009 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆడిన మ్యాచ్. 2012 వరల్డ్ కప్‌లో భాగంగా మూడోసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో భారత్ రెండు మ్యాచులు గెలుచుకోగా ఇంగ్లాండ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఇండియా, ఇంగ్లండ్.. రెండు జట్లలోనూ ఓపెనర్స్ నుంచి టెయిల్ ఎండ్ వరకు బలమైన లైనప్ ఉంది. రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా కొనసాగుతున్నారు కనుకే సెమీ ఫైనల్ స్టేజీ వరకు రాగలిగారు. అయితే ఈ మ్యాచుకి ముందు రెండు జట్లలోనూ ఒకరిద్దరు ఆటగాళ్లను గాయాలు వేధిస్తుండటం ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లకు, అభిమానులకు కొంత ఆందోళనకు గురిచేసే అంశం కానుంది.
ఇండియా vs ఇంగ్లండ్ ప్రాపబుల్స్ ఇలా ఉండనున్నాయి.
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లండ్: జోస్ బట్లర్ ( Jos Buttler - కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ ఉడ్ ఉన్నారు.
Also Read : Pakistan in Final: నక్క తోక తొక్కిన పాకిస్థాన్.. ఫైనల్‌కు చేరింది ఇలా..
Also Read : Pakistan: చెలరేగిన బాబర్ అజామ్ సేన.. కివీస్ చిత్తు.. ఫైనల్లోకి పాక్ ఎంట్రీ
Also Read : IND vs ENG: 'విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు రన్స్ చేయాలని కోరుకున్నా.. కానీ గురువారం మాత్రం డకౌట్ కావాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook